వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గబ్బర్ సింగ్‌లా బెల్టు, స్టార్ బ్యాట్స్‌మన్: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తమవాళ్లే తెలుగు తల్లి మెడను నరికేయమని అధిష్ఠానానికి చెప్పారని, ఒక వేటుకు తెగవేయకపోతే ఉద్యమాలు వస్తాయని ఢిల్లీలో తిష్టవేసి ఇప్పుడు కూడా చెబుతున్నారని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. అట్లా చేస్తే మరో ముఖ్యమంత్రి వస్తారనే భావనలో ఉన్నారని, పదవుల కోసం గోతి దగ్గర గుంట నక్కల్లా కాచుక్కూర్చోని ఉన్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

నిర్దాక్షిణ్యంగా తెలుగు తల్లిపైవేటు వేసేయండంటున్నారని, అలాంటి నేతల మాటలు చెల్లుబాటు కాకుండా చేస్తామని, వారి పేర్లను సరైన సమయంలో బయటపెడుతానని, వారి ప్రయత్నాలను వమ్ము చేస్తామని ఆయన అన్నారు. ప్రజల బాధలు గ్రహించకుండా పదవే పరమావధిగా వ్యవహరిస్తున్నవారికి ఏపీఎన్జీవోల సభ కనువిప్పు కావాలని హితవు పలికారు. తాము బహిరంగ యుద్ధం చేస్తుండగా, వారు ముసుగులో యుద్ధం చేస్తున్నారని, అంతిమ విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారని ఆయన అన్నారు. ఉపాధ్యాయునిగా ఉన్న తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం సంకుచిత భావంతో ఎపిఎన్జీవోల సభకు అడ్డుతగిలారని ఆరోపించారు.

స్టార్ బ్యాట్స్‌మన్ (ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి) ప్రతిభతోనే సభ సక్సెస్ అయిందని, లక్షల మంది ఆయన వెనుక ఉన్నారని లగడపాటి చెప్పారు. "మీటింగ్ పెడితే బంద్ చేస్తారా? పోలీసు యం త్రాంగం ఇలాంటి వారిపై గబ్బర్‌సింగ్ లా బెల్టు తీయాలి. ఎవరైనా విద్వేషాలు రగిల్చినా, ప్రజల మధ్య చిచ్చుపెట్టినా, కుల, మత, ప్రాంత విద్వేషాలు రగిల్చినా పోలీసులు గబ్బర్‌సింగ్‌లా తయారు కావాలి'' అని వ్యాఖ్యానించారు.

విభజనపై ముందుకు వెళుతున్నామన్న కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటనపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకెళ్లాలో, వెనక్కెళ్లాలో తెలియని పరిస్థితిలో కేంద్రం ఉందన్నారు. హైదరాబాద్ లేని ఏ రాష్ట్రమైనా ఎడారవుతుందన్నారు. కర్నూలు రాజధాని అయి ఉంటే హైదరాబాద్ కంటే ఎక్కు వ అభివృద్ధి చెందేదని వివరించారు.

పార్టీలు, ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా సమైక్య భావన బలపడిందని, ప్రజల భావన బయటకొచ్చిన తర్వాత అన్నీ పార్టీలు మనస్సు మార్చుకున్నాయని, ప్రజాస్వామ్యంలో ప్రజా శాసనానికి తలొగ్గాల్సిందేనని ఆయన అన్నారు. సమైక్యత కోసం దేనికీ వెనుకాడే పరిస్థి తి లేదు. విభజనపై కేంద్రం అడుగు ముందుకేస్తే మా ప్రయత్నాలు మరో రకంగా ఉంటాయని, ఏ ఎత్తుగడతోనైనా సమైక్యాంధ్రను కాపాడుకుంటామని తెలిపారు.

English summary
Congress Seemandhra MP Lagadapati Rajagopal has blamed Seemandhra leaders for the decision of bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X