బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు ... కేసు నమోదు

తెలంగాణా బీజేపీ నేత ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య బీజేపీ నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం రేపుతున్నారు. గతంలో కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపాయి. ఈమేరకు ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ వర్గం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముస్లిం యువతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ సోయం బాపూరావు .. కేసు నమోదు

ముస్లిం యువతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ సోయం బాపూరావు .. కేసు నమోదు

సోయం బాపూరావుపై కేసు నమోదు అయింది. ముస్లింలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అతనిపై 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ ఆడపిల్లల జోలికొస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. నిర్మల్,ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలాకాలంగా ముస్లిం యువత ఆదివాసీ యువతులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఇకనైనా తీరు మార్చుకోకపోతే వారి తల తీసేస్తానని హెచ్చరించారు.బాపూరావు చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని గాదిగూడ మండలంలో ఇటీవల నిర్వహించిన విజయోత్సవ సభలో బాపూరావు ఈ వ్యాఖ్యలు చేశారు.

సోయంబాపూరావు వ్యాఖ్యల వీడియో వైరల్ .. సోషల్ మీడియా షేర్ చేసిన వారిపై కూడా కేసు నమోదు

సోయంబాపూరావు వ్యాఖ్యల వీడియో వైరల్ .. సోషల్ మీడియా షేర్ చేసిన వారిపై కూడా కేసు నమోదు

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సోయం బాపూరావు పోటీ చేసి గెలుపొందారు. లోక్ సభ ఎన్నికల సమయానికే ఆయనపై అత్యధికంగా 52 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోనే కేసుల విషయంలో ఆయన టాప్ లో ఉన్నారు . ఇప్పుడు ఆయనపై మరోకేసు నమోదు అయింది. ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపూరావు వీడియోను కొంతమంది సోషల్ మీడియా లో వైరల్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ చేస్తున్న కొంతమందిపై కూడా కేసు నమోదైంది.

ఎంపీగా ఆయన తీరు కరెక్ట్ కాదన్న ముస్లిం సామాజిక వర్గం .. ఆయన వ్యాఖ్యలను ఖండించిన ముస్లింలు

ఎంపీగా ఆయన తీరు కరెక్ట్ కాదన్న ముస్లిం సామాజిక వర్గం .. ఆయన వ్యాఖ్యలను ఖండించిన ముస్లింలు

ఒక ప్రజాప్రతినిధిగా ఆయన కుల మతాలకు అతీతంగా వ్యవహరించాల్సింది పోయి ఒక మతాన్ని అవమానించేలా మాట్లాడటం సమంజసం కాదనే వాదన వినిపిస్తుంది . ఒక ఎంపీ తన నియోజకవర్గంలోని అన్ని కులాల, మతాల వారిని సమానంగా చూడాల్సిన చోట సోయం బాపూరావు ఈ తరహా వ్యాఖ్యలు చెయ్యటం శోచనీయం అనే భావన వ్యక్తం అవుతుంది . ఈ ప్రాంత గిరిజన మహిళలకు ముస్లింయువకులు ఇబ్బంది కలిగించవద్దని బెదిరించిన బిజెపి ఎంపి వ్యాఖ్యలను ముస్లిం సామాజికవర్గం తీవ్రంగా ఖండించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+