కాళికలా మారిన సతీ: మొగుడిని తాడుతో కట్టి, కొట్టి...
ఆలుమగలు.. చిలక గోరింకల మాదిరిగా కొందరే ఉంటారు. చాలా మంది గొడవ పడతారు. కానీ ఈ రోజుల్లో చేయి చేసుకోవడం రేర్ అనే చెప్పాలి. కానీ కొన్ని చోట్ల భర్తలు రెచ్చిపోతున్నారు. అవును.. ఇల్లాలిపై చేయి చేసుకుంటున్నారు. భార్యే కాదు.. పిల్లలను కూడా వదలడం లేదు. అవును అలాంటి ఘటన ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.
నిత్యం భర్త తాగుతూ..వచ్చి.. హింసిస్తుండడంతో ఆమె తట్టుకోలేకపోయింది. అందుకే అతడిని కరెంటు స్తంభానికి కట్టేసి చితకబాదింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గంబాల బస్తీలో తోపేల తిరుపతి, శారద దంపతులు ఉంటున్నారు. వీరికి వయస్సు వచ్చిన కూతురు కూడా ఉంది. తిరుపతి మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయక.. భార్య సంపాదనపై ఆధారపడ్డాడు. శారద పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ప్రతి రోజు తాగి వస్తూ.. ఆమెపై చేయి చేసుకొనే వాడు. హింసించడం మొదలు పెట్టాడు.

రోజు తాగొచ్చి భార్య, పిల్లలతో గొడవ పడేవాడు. మారుతాడని ఆమె అన్నీ భరించింది. ఆదివారం మద్యం మత్తులో ఇంటికి వచ్చి కూతురుపై చేయి చేసుకున్నాడు. దీనిని చూసిన శారద తట్టుకోలేక పోయింది. వెంటనే ఇంట్లో ఉన్న తాళ్లతో భర్తను కరెంటు స్తంభానికి కట్టేసింది. చితకబాది తన కోపాన్ని తీర్చుకుంది. తర్వాత కట్టేసిన తాళ్లను విప్పేసింది. భార్య ప్రవర్తన చూసి భర్త భయపడ్డాడు. ఆమెను చూసి భయభ్రాంతికి గురయ్యాడు.
భార్య దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది మంచి పనే చేశావని అంటున్నారు. కూతురుపై చేయి చేసుకోవడం ఏంటీ అని అంటున్నారు. స్థానికులకు కూడా అతని ప్రవర్తన తెలుసు.. అవును వెధవకు తగిన శాస్తి జరిగిందని కామెంట్ చేస్తున్నారు. దీనిని చూసి మరొకరు ఇలా చేయరని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications