లవ్ జర్నీ.. ముంబై టు ఆదిలాబాద్.. ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా..! (వీడియో)
Recommended Video
ఆదిలాబాద్ : ప్రేమ పేరుతో ఛీటింగ్ కామన్ అయిపోయినట్లుగా తయారైంది నేటి పరిస్థితి. ఆకర్షణ మంత్రంతో దగ్గరవుతూ ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అమ్మాయిలను ట్రాప్ చేస్తూ శారీరకంగా వాడుకుంటూ తీరా గర్భం దాల్చాక ప్లేటు ఫిరాయిస్తున్నారు కొందరు. ఆ క్రమంలో కర్ణాటక టు తెలంగాణ వయా ముంబైగా సాగిన ప్రేమకథ చర్చానీయాంశమైంది.
ముంబైలో చిగురించిన ప్రేమ ఘట్టం ఆదిలాబాద్‌కు చేరింది. ప్రేమించిన ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో తనను వెతుక్కుంటూ లవ్ జర్నీ చేసింది ఓ ప్రేమికురాలు. చివరకు ప్రియుడి గ్రామానికి చేరి మహిళా సంఘాల సాయంతో ధర్నాకు దిగింది.

ప్రేమ పేరుతో ముగ్గులోకి.. మూడేళ్ల సహజీవనం..!
కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతానికి చెందిన 22 సంవత్సరాల సునీతకు తల్లిదండ్రులు లేరు. ఆ క్రమంలో తనను ఆదుకునేవారు లేక జీవనపోరాటంలో ముంబైకు చేరుకుంది. అక్కడ ఓ అపార్టుమెంటులోని పలువురి ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ జీవిస్తోంది. అదే అపార్టుమెంటులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం మహేశ్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. అలా ఇద్దరు కలిసి ఒకే రూములో సహజీవనం చేస్తూ కాపురం చేశారు. దాంతో మూడుసార్లు గర్భం దాల్చింది.

ప్రియుడి ఇంటికి చేరిన ప్రేమకథ
ఇదివరకు రెండుసార్లు గర్భం దాల్చినప్పుడు అబార్షన్ చేయించాడని.. మూడోసారి గర్భం దాల్చడంతో తప్పించుకొని తిరుగుతున్నాడని ఆరోపిస్తోంది సునీత. ఫోన్ చేస్తే నీకు నాకు సంబంధం లేదంటూ బుకాయిస్తున్నాడని వాపోయింది. ఆ క్రమంలో ప్రియుడిని వెతుక్కుంటూ ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది.
ఇద్దరం ప్రేమించుకున్నామని.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మూడేళ్లు తనను శారీరకంగా వాడుకున్నాడని చెబుతోంది. అంతేకాదు తన ఆర్థిక అవసరాలకు తన దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడని ఆరోపిస్తోంది. ఇప్పుడు తాను 2 నెలల గర్భవతిగా ఉన్నానని.. పెళ్లి చేసుకొమ్మని అడగడంతో ముంబై నుండి తన ఇంటికి చేరుకుని దొరక్కుండా తిరుగుతున్నాడని వాపోయింది.
స్థానికులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా
ప్రేమ పేరుతో దగ్గరయి తనను గర్భవతిని చేసి చివరకు మొఖం చాటేశాడని ఆరోపిస్తోంది బాధితురాలు. ఆ క్రమంలో బుట్టాపూర్ గ్రామానికి చేరుకుని ప్రియుడి కోసం ఆరా తీసింది. అతని జాడ కనిపించకపోవడంతో గ్రామ పెద్దలను కలిసింది. అదే క్రమంలో స్థానిక మహిళా సంఘాల నేతలను కలిసి తన పరిస్థితిని వివరించడంతో వారు ఆమెకు బాసటగా నిలిచారు. దస్తురాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను మోసగించిన సదరు ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని బైఠాయించారు. అనంతరం అక్కడి నుంచి మహేశ్ ఇంటికి చేరుకుని ధర్నా చేపట్టారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications