అమరావతిలో కొత్త ప్రాజెక్టు - త్వరలో ప్రారంభం..!?

అమరావతిలో కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అధికారులు కసరత్తు ప్రారంభించారు.

అమరావతిలో కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అమరావతి రైల్వేలైన్‌ ప్రాజెక్టు మరోసారి తెరమీదకొచ్చింది. గతంలోనే ప్రతిపాదించిన ప్రాజెక్టును ఇప్పుడు అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బడ్జెట్ లో కేటాయింపులు పూర్తయ్యాయి. రాజధాని విషయంలో నెలకొన్న పరిణామాల కారణంగా ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఇప్పుడు తాజాగా దీనిని పూర్తి చేసేందుకు కసతరత్తు వేగవంతం అయింది. రైల్వే అధికారుల తాజా నిర్ణయం అమరావతి మీదుగా కనెక్టివిటీ పెరిగేందుకు దోహదం చేయనుంది.

అమరావతితో రైల్వే ప్రాజెక్టు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చనున్నాయి. విజయవాడ రైల్వే జంక్షన్ పైన ఉన్న రద్దీ భారాన్ని తగ్గించేందుకు అదనపు రైల్వే లైన్ మార్గా పైన అధికారులు ఫోకస్ చేసారు. భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని కొత్త మార్గాల పైన ప్రతిపాదనలు సిద్దం చేసారు. ఆ ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ఆమోదం కూడా లభించింది. కానీ, క్షేత్ర స్థాయిలో అమలు కాలేదు. ఇప్పుడు ఈ ప్రతిపాదనలు అమలు దిశగా రైల్వే అధికారులు అడుగులు వేస్తున్నారు. అమరావతి రైల్వేలైన్‌ ప్రాజెక్టు అమలు దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. అప్పట్లో అమరావతి రైల్వే లైన్‌ కోసం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలోమీటర్ల మేర సింగిల్‌ లైన్‌ను ప్రతిపాదనలు అందాయి. అమరావతి రైల్వే లైన్‌ కోసం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలోమీటర్ల మేర సింగిల్‌ లైన్‌ను ప్రతిపాదించారు.

Amaravati Railway project again on Screen, Officials planning to begin works in next few months

ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా అమరావతి నుంచి పెదకూరపాడు వరకు 25 కి.మీ. సింగిల్‌ లైన్‌, సత్తెనపల్లి నుంచి నరసారావుపేట వరకు 25 కి.మీ. సింగిల్‌ లైన్‌, కృష్ణా నది మీదుగా 3 కి.మీ. మేర నూతన బ్రిడ్జి నిర్మాణం వంటివి ప్రతిపాదించారు. ఈ నాలుగు ప్రాజెక్టులకు రూ 2800 కోట్లను 2017-18 బడ్జెట్ లో కేటాయించారు. దీంతో, ఇప్పుడు ప్రాజెక్టులో భాగంగా ఎర్రుపాలెం - అమరావతి - నంబూరు వరకు 28 కి.మీ. సింగిల్‌ లైన్‌ చేపట్టాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. విజయవాడ బైపాస్‌ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఈ లైన్ నిర్మాణం కొనసాగించాలని అధికారులు ప్రణాళికలు సిద్దం చేసారు. ఇప్పటికే నిధుల కేటాయింపు పూర్తి కావటంతో..సాంకేతిక అంశాలు మినహా ఆర్దికపరమైన అంశాలు సమస్య కాదని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు డివిజన్ నుంచి తాజా ప్రతిపాదనలు వెళ్లాయి. అధికారిక కసరత్తు పూర్తయిన వెంటనే ఈ లైన్ మార్గం పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. దీని ద్వారా విజయవాడ స్టేషన్ పైన రద్దీ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా అమరావతి ప్రాంతానికి కొత్త ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని వివరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+