అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది.

సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ

సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ

సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు.

సభ్యులు వీరే..

సభ్యులు వీరే..

మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఏఎంఆర్డీఏలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. ఆర్థికశాఖ ముఖ్యయ కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్, మున్సిపల్ పరిధిలో ఉండే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం డైరెక్టర్, గుంటూరు ఉప రవాణా కమిషనర్, గుంటూరు జిల్లా రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్, కృష్ణా జిల్లా రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్, ట్రాన్స‌్‌కో విజయవాడ సూపరింటెండెంట్ ఇంజినీర్, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సభ్య సమన్వయకుడిగా వ్యవహరిస్తారు.

ఏఎంఆర్డీఏ పరిధిలోనే

ఏఎంఆర్డీఏ పరిధిలోనే

గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి ప్రాంతాలను ఏఎంఆర్డీఏ పరిధిలోకి తీసుకొస్తారని తెలుస్తోంది. రాజధాని ప్రాంత రైతులు నష్టపోకుండా ఉండటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏఎంఆర్డీఏ పరిధిలోకి వాటిని తీసుకుని రావడం వల్ల భూముల విలువ తగ్గకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధులను విలీనం చేస్తూ.. ప్రత్యేక కార్పొరేషన్‌గా గుర్తించడానికి చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా- వాటి పరిధిలోని ప్రాంతాలను ఏఎంఆర్డీఏ కిందికి చేర్చుతారని అంటున్నారు.

Recommended Video

Andhra Pradesh : Just Apply For E-pass And Travel To AP Without Clearance || Oneindia Telugu
సీఆర్డీఏకు ఉన్న ప్రాధాన్యతను కొనసాగించేలా..

సీఆర్డీఏకు ఉన్న ప్రాధాన్యతను కొనసాగించేలా..

ఇదివరకు సీఆర్డీఏకు ఉన్న ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గకుండా అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అంటున్నారు. అమరావతి పరిధి మొత్తాన్నీ దశలవారీగా మెట్రోపాలిటన్ హోదా కిందికి తీసుకుని రావడం వల్ల భూములు, ప్లాట్ల ధరల్లో క్షీణించే అవకాశం ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా- రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏఎంఆర్డీఏను అభివృద్ధి చేసే విషయంలో ఎక్కడా రాజీపడకూడదంటూ మున్సిపల్ శాఖను సూచించినట్లు సమాచారం.

English summary
Andhra Pradesh government headed by YS Jagan Mohan Reddy created as Amaravati Metropolitan Region Development Authority (AMRDA) has been formed in the place of Capital Region Development Authority (CRDA) Scrapped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X