Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Severe Rainfall Alert: 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు

ఏపీకి భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలియజేశారు. మూడు రోజులు వర్ష బీభత్సం ఉంటుందని వివరించారు. నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతుంది. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి కొనసాగుతోంది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు కర్ణాటక తీరానికి దగ్గరగా తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ap Weather News: Severe Rain Alert In andhra pradesh For Next 3 Days

Recommended Video

    Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu

    ఇటు దైవభూమి కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కొండచరియలు విరిగిపడటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరడంతో.. వారి బాధ వర్ణణాతీతంగా మారింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్ష బీభత్సం కొనసాగింది. ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంది. ఆయకట్టు కింది ప్రాంతాలు.. ఇతర చోట్ల పంటలకు ఢోకా లేకుండా పోయింది. ప్రాజెక్టు నీరు రానీ చోట.. బావులపై ఆధారపడిన వారు మాత్రమే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+