ఏపీఎస్ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. 22 వరకు డెడ్‌లైన్..!
అమరావతి : ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యం తీరు నిరసిస్తూ కార్మికులు మళ్లీ రోడ్డెక్కనున్నారు. ఆ మేరకు ఎన్ఎంయూ కార్మిక సంఘం నేతలు బుధవారం సమ్మె నోటీసు ఇచ్చారు. 46 డిమాండ్లతో కూడిన నోటీసును ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు అందించారు. అటు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కూడా గురువారం నాడు సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ యాజమాన్యం దిగిరాని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అంటున్నారు.

డిమాండ్ల సాధన కోసం సమ్మె సైరన్
డిమాండ్ల సాధన కోసం మరోసారి ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కనున్నారు. ఇదివరకు పలుమార్లు యాజమాన్యంతో జరిపిన చర్యలు సఫలం కాలేదు. దాంతో మరోసారి సమ్మె సైరన్ మోగింది. కార్మికులకు వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలనే ప్రధాన డిమాండుతో పాటు సిబ్బంది కుదింపు, గ్రాట్యుటీ తగ్గింపు తదితర నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సులను పెంచాలనే నిర్ణయాన్ని కూడా కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. దాన్ని కూడా ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు.
కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, తద్వారా ఆర్టీసీని రక్షించే ప్రయత్నం చేయాలని కోరారు. ఒకవేళ యజమాన్యం స్పందించని పక్షంలో ఈ నెల 22 తర్వాత ఏ క్షణమైనా రాష్ట్రమంతటా బస్సులను నిలిపివేస్తామని ఎన్‌ఎంయూ కార్మిక సంఘం నేతలు హెచ్చరించారు. ఆ మేరకు ఆర్టీసీ యజమాన్యానికి నోటీసు ఇచ్చారు. అదలావుంటే గురువారం నాడు ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కూడా సమ్మె నోటీసు ఇవ్వాలని డిసైడయ్యారు.

ప్రధాన డిమాండ్లతో నోటీసు
ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్ఎంయూ కార్మిక సంఘం నేతలు సమర్పించిన నోటీసులో ప్రధాన డిమాండ్లు పేర్కొన్నారు. అవి ఏంటంటే.. ప్రధానంగా కార్మికులకు వేతన బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన 650 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయాలి. కార్మికుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. నష్టాల నుంచి బయటపడేలా ప్రతి సంవత్సరం కొత్త బస్సుల కొనుగోలుకు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలి.

అప్పట్లో మంత్రి హామీ.. నెల దాటినా జాడలేదు..!
ఆర్టీసీలో గత కొంతకాలంగా యాజమాన్యం, కార్మికుల మధ్య సఖ్యత లేదనే చెప్పొచ్చు. డిమాండ్ల సాధన కోసం 2018, డిసెంబరులో కార్మిక సంఘాలన్నీ కలిపి సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఇక సమ్మెకు వెళ్లడమే తరువాయి అనుకున్న సందర్భంలో ప్రభుత్వం స్పందించింది. కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో మంత్రి అచ్చెన్నాయుడు కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. వారి డిమాండ్లలో ప్రధానమైన వేతన సవరణ బకాయిల డిమాండ్ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. 2003 నుంచి కార్మికులకు రావాల్సిన వేతన సవరణ బకాయిలను ఉగాది పండుగ రోజున చెల్లించడానికి ఓకే చెప్పారు. కానీ, ఉగాది పండుగ గడిచిపోయి నెల రోజులు దాటుతున్నా.. ఇంతవరకు దాని ఊసే లేదు. దాంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు మరోసారి సమ్మెకు సన్నద్ధమవుతున్నాయి.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications