అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆధారాలిస్తాం.. యూనిఫాం వదిలేస్తారా...చంద్రబాబు, ఢిల్లీ పర్యటన

|
Google Oneindia TeluguNews

టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష ముగిసింది. మంగళగిరి టీడీపీ ఆఫీసులో తెలుగు మహిళలు నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు. దీక్ష ముగించిన వెంటనే చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు.

దీక్ష ముగిసిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గంజాయిపై మాట్లాడితే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారని చెప్పారు. ఆధారాలు ఇస్తాం.. పోలీసులు యూనిఫాం తీసివేయాలని కోరారు. తమది ధర్మ పోరాటం అని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు కదిలి వచ్చిన కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.

chandrababu naidu angry on cm jagan

ప్రజల దేవాలయం ఎన్టీఆర్ భవన్ అని చెప్పారు. దానిపై దాడి చేశారని.. అందులో 70 లక్షల కార్యకర్తలు మనోభావాలు దాగి ఉన్నాయని వివరించారు. పోలీస్ బెటాలియన్ దగ్గరలో దాడి జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయని పేపర్‌లో న్యూస్ వచ్చిందని వివరించారు. విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని తెలిసినా పట్టించుకోలేదని వివరించారు. మద్యం రేట్లు భారీగా పెంచారని గుర్తుచేశారు. రూ.60 ఉన్న మందును రూ.200 చేశారని వివరించారు. మత్తుకు బానిసై.. కొందరు కరోనా సమయంలో శానిటైజర్ తాగారని వివరించారు. తమ హయాంలో మద్యం నిషేధం పారదర్శకంగా జరిగిందని చెప్పారు.

Recommended Video

Congress అధికారంలోకి వస్తే KCR జైలుకే..! - Kalva Sujatha

మరోవైపు సోమవారం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. చంద్రబాబు, ఇతర టీడీపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ ఖరారైంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించాలని రాష్ట్రపతిని కోరనున్నారు. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలవనుంది.

English summary
will give you evidence you must resign job tdp chief chandrababu naidu said to police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X