అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సు..! కాల్ మనీ, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి అద్యక్షతన ఉండవల్లిలోని ప్రజావేదికలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సమావేశం ప్రారంభం అవ్వగానే హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడారు. పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు నివారిస్తామని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నివారణకు పోలీసులు భాగస్వామ్యం అవుతారన్నారు. పోలీస్ శాఖలో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేస్తామని సైబర్ నేరాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సుచరిత తెలిపారు. అంతే కాకుండా బెల్ట్ షాపులు, కాల్ మనీ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని ఏపి సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేసారు.

ప్రజావేదిక కూల్చేవేయడం అవివేకమంటున్న టీడిపి..! అదేం కాదంటున్న వైసీపి..!! ప్రజావేదిక కూల్చేవేయడం అవివేకమంటున్న టీడిపి..! అదేం కాదంటున్న వైసీపి..!!

Recommended Video

ఏపీలో మహిళలకు 25 లక్షల ఇళ్ళపట్టాలు
ప్రజా వేదికలో జగన్ రెండో రోజు..! కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం..!!

ప్రజా వేదికలో జగన్ రెండో రోజు..! కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం..!!

ఉండవల్లి లోని ప్రజా వేదిక లో మంగళవారం కలెక్టర్లు కాన్ఫరెన్స్ లో ఎస్పీ లతో , కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో రెండో రోజు పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ పై సమీక్ష సమావేశం. ఎస్పీ లు, జిల్లా కలెక్టర్ లు, పోలీస్ ఉన్నతాధికారుల తో రెవిన్యూ (ల్యాండ్), హోమ్, రవాణా& రహదారుల భవనాల, కమిషనర్ రవాణా, స్పెషల్ సీఎస్ (ఎక్స్ జ్), ఎక్స్ జ్ కమిషనర్, పరిశ్రమలు శాఖ కార్యదర్శి, కమిషనర్ లతో, మహిళా స్త్రీ సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ లతో ఉన్నతస్థాయి సమావేశం సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం, డిజిపి గౌతమ్ సవాంగ్ , 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులుతదితరులు పాల్గొన్నారు. కెఆర్ కిషోర్ కుమార్ , ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. అనంతరం డిజిపి రూపొందించిన ఎజెండా అంశంపై జిల్లా కలెక్టర్ లతో పోలీస్ శాఖ కు సంబంధించిన సమీక్ష నిర్వహిస్తారు.

బెల్టు షాపులు, కాల్ మనీ పై ఉక్కు పాదం..! పోలీసులు కఠినంగా ఉండాలన్న జగన్..!!

బెల్టు షాపులు, కాల్ మనీ పై ఉక్కు పాదం..! పోలీసులు కఠినంగా ఉండాలన్న జగన్..!!

అక్టోబరు 1 నాటికి బెల్టుషాపులు పూర్తిగా ఎత్తివేయాల్సిందేనని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలకు సీఎం ఆదేశాలు జారీ చేసారు. సమాజానికి మంచి చేసే నిర్ణయాల అమల్లో అడుగులు ముందుకు పడాల్సిందేనని అన్నారు. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దని, దాబాల్లో లిక్కర్‌ అమ్మకుండా చూడాలని సీఎం ఆదేశించారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ అంశంపై సీఎం సీరియస్‌ గా స్పందించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదన్న సీఎం వైయస్‌ జగన్‌
ఏ పార్టీవారు ఉన్నా విడిచిపెట్టొద్దని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళణ చేయాలని ఆదేశాలు జారీ చేసారు.
ఎవరికైనా ఫిర్యాదు ఉంటే వెంటనే తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం, విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమన్నారు.

పోలవరం నిర్వాసితుల పరిహారంలో జగన్ మరో ముందడుగు..! ప్రత్యేక ఐఏఎస్ అధికారి నియామకం..!

పోలవరం నిర్వాసితుల పరిహారంలో జగన్ మరో ముందడుగు..! ప్రత్యేక ఐఏఎస్ అధికారి నియామకం..!

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఒక్కొక్కటిగా చిక్కులు తొలుగుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో నిర్వాసితులు పరిహారం కోసం ఆందోళన చేస్తున్నారని ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
ఇందుకు స్పందించిన వైఎస్ జగన్.. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా పోలవరం పునరావస సమస్యలపై గ్రీవియెన్స్ సెల్ పెట్టనున్నట్లు తెలిపారు. ఇకపై ఈ సెల్‌కు నిర్వాసితులు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఉంటుంది. పోలవరం ఆర్అండ్ఆర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు..! ప్రజావేదిక పై బాబు స్పందనపై అందరి దృష్టి..!!

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు..! ప్రజావేదిక పై బాబు స్పందనపై అందరి దృష్టి..!!

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. జూన్ 19న ఆయన యూరప్ పర్యటనకు కుటుంబంతో కలిసి వెళ్లారు. అయితే.. ఆయన విదేశీ పర్యటనలో ఉండగానే టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో స్వదేశానికి వచ్చాక ఆయన పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగానే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ్యులు బీజేపీలో చేరడం, టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరడం, తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, బోడె జనార్థన్ కూడా కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడంతో చంద్రబాబు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి అటు టీడీపీతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా నెలకొంది. పార్టీ జంపింగ్‌ల సంగతి పక్కన పెడితే.. ప్రజావేదిక కూల్చివేయాలంటూ సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనే అంశం అత్యంత ఉత్కంఠగా మారింది. ఇదే ప్రజావేదికను తమకు కేటాయించాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన సంగతి కూడా తెలిసిందే. అయితే.. ఈ నిర్మాణమే అక్రమమంటూ కూల్చివేయాలని వైసీపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

English summary
The CM has issued a directive to all the District Collectors and that the beltshops should be lifted completely by October 1. He said that steps should be taken to implement good decisions for the society. CM ordered that liquor stores along the national highways should not be sold in lobby. CM responded seriously on the subject of the call money sex racket. CM YS Jagan has instructed the police officers not to leave any party to prevent such incidents from happening again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X