పవన్ కళ్యాన్ ఎఫెక్ట్ : సీయం దీక్షకు కమ్యూనిస్టులు దూరం : కేసులు పెట్టారు...!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వేదికగా చేస్తున్న దీక్ష కు బిజెపీతర పక్షాల నేతలు వచ్చి మద్దతు ప్రకటించారు. కాం గ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తో సహా ఇతర పార్టీల ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఎంతో కాలంగా చంద్రబాబు తో సన్నిహితంగా ఉండే వామపక్ష నేతలు మాత్రం కనిపించలేదు. బిజెపికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి వామపక్ష నేతలు ఎందుకు మద్దతు ఇవ్వలేదనేది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది...దీనికి కారణం పవన్ కళ్యానేనా..
తరలి వచ్చిన అగ్రనేతలు..
ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో దీక్ష కొనసాగిస్తున్నారు. ఏపి కి కేంద్రం చేసిన మోసం పై ఆయన ఢిల్లీ వేదికగా ధ్వజ మెత్తుతున్నారు. ఆయన దీక్షకు మద్దతుగా బిజెపి ఇతర పక్షాల నేతలంతా తరలి వస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ తో పాటుగా మాజీ ప్రధాని మన్మోహన్, శరద్ పవార్, శరద్ ప వార్, శరద్ యాదవ్, కేజ్రీవాల్, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ వంటి నేతలు వచ్చి ముఖ్యమంత్రి కి సంఘీభావం
ప్రకటించారు. ప్రధాని మోదీ తీరును తప్పు బట్టారు. ఏపికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. కొద్ది రోజులుగా బిజెపి వ్యతిరేక పక్షాలు ఒక్కటవుతున్న వేళ వీరంగా చంద్రబాబు దీక్ష వద్దకు తరలి వచ్చారు.
వామపక్ష నేతలు దూరం..
ఢిల్లీలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీలో చేస్తున్న దీక్షకు వామపక్షాలు దూరంగా ఉన్నాయి. ప్రభు త్వం తమను ఆహ్వానించిందని,కాని తాము వెళ్లదలచుకోలేదని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి మధు చెప్పారు. గతంలో తాము ప్రత్యేక హోదా కసం ఆందోళనలు చేసినప్పుడు తమపై చంద్రబాబు కేసులు పెట్టించారని, జైళ్లకు పంపారని వారు అన్నార. అప్పుడు పెట్టిన కేసులు ఇంతవరకు ఎత్తివేయలేదని, తమ కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పోరాటం చేయాల్సిన సమయంలో చేయకుండా మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో చంద్రబాబు చేస్తున్న హడావిడి రాజకీయ ప్రయోజనం కోసమేనని వారు వ్యాఖ్యానించారు. అయితే, వామపక్ష నేతలు ఈ నెల 1న నిర్వహించిన బంద్‌లో పాల్గొన్నారు. మోదీ ఏపి పర్యటనను నిరసిస్తూ ఆందోళ నలు నిర్వహించారు.

పవన్ కారణంగానే దూరమా..
ఏపిలో వచ్చే ఎన్నికల్లో పవన్ తో కలిసి వెళ్లాలని వామపక్ష పార్టీ నేతలు నిర్ణయించారు. ఉండవల్లి నిర్వహించిన రౌం డ్ టేబుల్ సమావేశానికి పవన్ తో పాటుగా వామపక్ష పార్టీలు హాజరయ్యాయి. ఆ మరుసటి రోజు ప్రభుత్వం నిర్వహించి న అఖిలపక్ష సమావేశానికి రావటం లేదని పవన్ లేఖ రాయగానే..వామపక్ష పార్టీలు గైర్హాజరయ్యాయి. ఇక, ఢిల్లీలో చంద్రబాబు దీక్ష కు మద్దతు కోరుతూ పవన్ కు ఎటువంటి అభ్యర్దన ప్రభుత్వం నుండి రాలేదు. దీని పై పవన్ ఇప్పటి దాకా స్పందించ లేదు. దీంతో..వామపక్ష నేతలు సైతం చంద్రబాబు దీక్షకు దూరంగా ఉన్నారు. సహజంగా జాతీయ స్థాయిలో వామపక్ష నేతల తో ముఖ్యమంత్రికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే, ఈ సారి వారు కూడా సీయం దీక్ష వద్దకు రాలేదుద. ఈ అంశం ముఖ్యమంత్రి దీక్షా వేదిక వద్ద చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications