500 సార్లు జైలుకు వెళ్లేందుకు సిద్ధం: నారా లోకేశ్
సీఎం జగన్ పాలనలో అఘాయిత్యాలకు గురైన అక్కాచెల్లెళ్లకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టంచేశారు. దళిత కుటుంబానికి అండగా నిలబడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించేందుకు ప్రయత్నిస్తారా? అని మండిపడ్డారు. అదే తన నేరమైతే..ఐపీసీలో ఉన్న అన్ని సెక్షన్లతో కేసులు పెట్టుకోవాలని కోరారు. దళిత బిడ్డ రమ్య హంతకుడిని శిక్షించే వరకూ తన పోరాటం ఆగదని చెప్పారు.
500 కుటుంబాలకీ న్యాయం జరిగేవరకూ 500 సార్లైనా జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నానని నారా లోకేష్ పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరిగేందుకు పోరాడుతామని స్పష్టంచేశారు.
రమ్యను ఒక మృగాడు నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్యచేశాడని లోకేశ్ గుర్తుచేశారు. దోషులకు ఏం శిక్ష వేయబోతున్నారు?" అంటూ ప్రశ్నించారు. సోదరి రమ్యకు న్యాయం జరగాలని, దిశ చట్టం ద్వారా హంతకుడికి 21 రోజుల్లో శిక్ష పడాలని లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థిని రమ్య కుటుంబానికి అండగా నిలబడడం మేం చేసిన తప్పా? అని ఆయన ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేసిన పోలీసులు వైసీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రమ్య హత్య జరిగితే... గన్ కన్నా ముందు వస్తాడన్న జగన్ ఎక్కడికెళ్లారని లోకేశ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత జగన్ రెడ్డి స్పందించడం బాధాకరమని పేర్కొన్నారు. "దిశ చట్టం తెచ్చామని మీరు చెబుతున్నారు. 20 రోజుల్లో గనుక రమ్య కుటుంబానికి న్యాయం చేయకపోతే 21వ రోజున టీడీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయమే రమ్య హత్యకు దారితీసిందని ఇన్‌ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ తెలిపారు. నిందితుడు శశికృష్ణకు, రమ్యకు ఆర్నెల్ల కిందట ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రేమించాలని రమ్య వెంటపడేవాడని, రెండు నెలలుగా మితిమీరి వేధించాడని తెలిపారు. దాంతో శశికృష్ణతో రమ్య మాట్లాడడం మానేసిందని, ఇది మనసులో పెట్టుకున్న శశికృష్ణ పలుమార్లు బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని వెల్లడించారు. చివరికి ఆమెతో వాగ్వాదం జరిగిన అనంతరం కత్తితో నరికి చంపాడని తెలిపారు.
స్థానికులు అడ్డుకుని ఉంటే రమ్య బతికుండేదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాల పట్ల యువత దూరంగా ఉంటే మేలని హితవు పలికారు. ఇలాంటి పరిచయాలను ఆసరాగా చేసుకుని వేధించే వాళ్లపై ఫిర్యాదు చేయాలని, రమ్య కూడా ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమోనని ఇన్చార్జి డీఐజీ అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. మృతురాలి ఫోన్ డేటా నుంచి డిలీట్ అయిన వివరాలను కూడా రాబట్టి, దర్యాప్తును ముందుకు తీసుకెళతామని అన్నారు. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి చైతన్యం కలిగించేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారని వెల్లడించారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications