వైఎస్ఆర్ సీపీలో చేరడానికి మరో నటుడు రెడీ: ఆయన వెనుక అలీ ఉన్నారా?
అమరావతి: తెలుగు చిత్ర పరిశ్రమలో మెజారిటీ నటులు, టెక్నీషియన్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నటి జయసుధ, పృథ్వీ, అలీ, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, భానుచందర్, ఛోటా కె నాయుడు వంటి నటులు, టెక్నీషియన్లు అధికారికంగా వైఎస్ఆర్ సీపీలో చేరారు కూడా.
ఇదే జాబితాలో మరో పేరు కూడా వినిపిస్తోంది. హాస్యనటుడు శివాజీ రాజా కూడా త్వరలోనే వైఎస్ఆర్ సీపీలో చేరబోతున్నారనేది ఫిల్మ్ నగర్ టాక్. ఈ నెల 24వ తేదీన ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి, పార్టీలో చేరుతారని టాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు.

తోటి హాస్యనటుడు అలీ ప్రోద్బలంతోనే శివాజీ రాజా వైఎస్ఆర్ సీపీలో చేరి, రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తపై శివాజీరాజా తన స్పందన తెలియజేయలేదు. అలాగని ఈ వార్తను ఖండించనూ లేదు. ఆయన ఎంట్రీ ఖాయమనే చెబుతున్నారు.












Click it and Unblock the Notifications