అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోల‌వ‌రం లో కీల‌కం : తొలి రేడియల్ గేటు ఏర్పాటు : 61 శాతం ప‌నులు పూర్తి

|
Google Oneindia TeluguNews

ఏపి ప్ర‌జ‌ల సుదీర్ఘ క‌ల పోల‌వ‌రం లో కీల‌క‌మైన గేట్ల ఏర్పాటు ప్ర‌క్రియ ఆరంభ‌మైంది. ప్రాజెక్టు తొలి రేడియ‌ల్ గేట్ ఏర్పాటుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రారంభించారు. స్పిల్ వే లో 41వ గేటు ఏర్పాటుకు చంద్ర‌బాబు పూజ‌ల చేసారు. ఆ త‌రువాత గేటు ఏర్పాటు ప్ర‌క్రియ‌ను అధికారులు మొద‌లు పెట్టారు..

ఒక్కో గేటు 20 మీటర్లు ఎత్తు.. వెడ‌ల్పు 15 అడుగులు..

పోల‌వ‌రం కాంక్రీట్ ప‌నులు వాయిదా : జ‌న‌వ‌రిలో కొన‌సాగింపుపోల‌వ‌రం కాంక్రీట్ ప‌నులు వాయిదా : జ‌న‌వ‌రిలో కొన‌సాగింపు

పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క‌మైన రేడియ‌ల్ గేట్ల నిర్మాణం ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ముఖ్య‌మంత్రి గేట్ల ఏర్పాటు ను ప్రారంభించారు. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్ల‌ను అమ‌ర్చే విధంగా ప్లానింగ్ జ‌రిగింది. ఇందులో తొలి గేట్ ను శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ప్రాజెక్టు నిర్మాణ అధికారులు బిగింపు ప్ర‌క్రియ ప్రారంభించారు. ఒక్కో గేటు ఎత్తు 20.83 మీటర్లు కాగా, వెడల్పు 15.9 అడుగులుగా ఉంది. మొత్తం గేట్ల తయారీకి 18వేల టన్నుల ఉక్కు అవసరం అవుతుందని అంచనా వేశారు.

Key step in Polavaram project : Spillway Gates work starts

మొత్తం గేట్ల తయారీ కోసం రూ.530 కోట్ల వ్యయం కానుంది. ఒక్కో రేడియ‌ల్ గేటు బరువు 300 టన్నులు. వీటిని నిలబట్టడం కోసం హైడ్రాలిక్ సిలిండర్లను వాడనున్నారు. ఒక్కో సిలిండర్ బరువు 250 టన్నులు ఉంటుంది. వీటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని హైడ్రాలిక్ సిలిండర్లు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నాయి.

ఇక గేట్ల ఏర్పాటు ప్రక్రియలో హైడ్రాలిక్ సిలిండర్లు సహా సెల్ఫ్ లూబ్రికేటింగ్ బూస్టులు కీలకంగా ఉంటాయని ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. వీటిని జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మొత్తం 96 బూస్టులు అవసరం అవుతాయని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.

61 శాతం ప‌నులు పూర్తి...

ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా 61 శాతం వ‌ర‌కు ప్రాజెక్టు ప‌నులు పూర్త‌యిన‌ట్లు ప్ర‌భుత్వం చెబుతోంది. పోలవరం ప్రాజెక్టును 2019 మే నెల చివరి నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ బహుళార్ధసాధక ప్రాజెక్టు ఎత్తు 129 అడుగులు కాగా పొడవు 9560 అడుగులు.

దీని ద్వారా 950 మెగా వాట్ల విద్యుత్ ఉత్ప త్తి చేయడమే కాక.. సాగు, తాగు నీరు అందించేలా పథక రచన చేశారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గేట్ల ఏర్పాటు స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్థానికంగా హాజ‌రైన రైతుల‌ను ఉద్దేశించి మాట్లాడారు...

English summary
Key development in Polavaram construction. C.M Chandra Babu inaugurated first Radial gate. Total 61 perent works so far completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X