రాధాకృష్ణా! ఈ భజన ఎందుకండీ?: నాగబాబు, పవన్ కళ్యాణ్-శ్రీరెడ్డి ఇష్యూ లాగి...
హైదరాబాద్: ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానల్లో సెటైర్లు వేశారు. లోకేష్‌కు భజన చేస్తున్నారని చెప్పారు. అయితే దీనిని తొలగించాలని సదరు ఛానల్ ఆయనను ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాగబాబు మరోసారి తాజాగా, గురువారం స్పందించారు.
ఓ ఛానల్లో వచ్చిన వీడియోపై తన కామెంట్ పెట్టానని, నేను వారి గురించి తప్పుగా మాట్లాడలేదని, అయినప్పటికీ తన ఛానల్ నుంచి వారి న్యూస్ ఐటంను తీసివేయాలని ఈ మెయిల్ పెట్టారని, ఆ ఐటం తీసివేయకుంటే తన ఛానల్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పారని నాగబాబు చెప్పారు. ఈ విషయంలో తాను అసంతృప్తితో ఉన్నానని, ఏదో సరదాగా చేసినందుకు మీరు అంత సీరియస్ అవుతే ఎలా సార్.. కోప్పడకండి సార్.. అని నవ్వుతూ చెప్పారు. పత్రికా స్వేచ్ఛను నొక్కకూడదని చెప్పి, మా స్వేచ్ఛను నొక్కివేస్తారా అని చెప్పారు. మీ పైన ఓ చిన్న జోక్ వేస్తే తట్టుకోలేరా అన్నారు. మీరు చెప్పినట్లే ఆ వీడియోను తీసేస్తానని చెప్పారు.

శ్రీరెడ్డి ఇష్యూని గుర్తు చేసి
ఎవరో ఒక ఆడపిల్ల బూతు తిడితే, అది బూతు కాదని, వ్యవహార భాషలో వాడే పదమని మీరు మా పైన (మెగా కుటుంబం, పవన్ కళ్యాణ్) వ్యక్తిగతంగా నోటికి వచ్చినట్లు మాట్లాడారని శ్రీరెడ్డి ఇష్యూను గుర్తు చేశారు. మేం మాత్రం మిమ్మల్ని క్వశ్చన్ చేయవద్దా అన్నారు. మీ బట్రాజు పొగడ్తలను మేం ప్రశ్నించవద్దా అన్నారు. మీరు మీ వార్త చూపిన నా వీడియోను ఆపగలరేమో కానీ, నా ఎక్స్‌ప్రెషన్‌ను ఎలా ఆపుతారని ప్రశ్నించారు.

ఏబీఎన్ భజన కృష్ణ
ఈ సందర్భంగా సీబీఎన్ - భజన కృష్ణ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్పారు. మీ ముందు ఇంకా ముందు చాలా ఉన్నాయని చెప్పారు. మీరు ఒక్క వీడియో ఆపినంత మాత్రాన నా ఛానల్, నా జర్నీ ఆగిపోదని చెప్పారు. మీరు మీ టీవీ ఛానల్‌తో మా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు కదా అని గుర్తు చేశారు. అఫ్ట్రాల్ ఒక్క వీడియో తీసేసినంత మాత్రాన మేం బాధపడమని చెప్పారు. నా భావాలను ఆపలేరని చెప్పారు. ఈ సందర్భంగా మళ్లీ లోకేష్ స్పీచ్‌పై భజన చేశారంటూ విమర్శలు గుప్పించారు.

రాధాకృష్ణా! ఇలాంటి భజన ఎందుకండి?
నారా లోకేష్, చంద్రబాబును చూసి కియా పరిశ్రమ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారని భజన కొట్టారంటూ చిరుతలు కొడుతూ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ ఏపీలో పెట్టుబడులు పెడతానంటే కబ్జా చేయాలని చూశారని ఏబీఎన్ చెప్పిందని, ఆయనకు మరేం పని లేదని అలా చేస్తారా అని ఎద్దేవా చేశారు. ఆంధ్రా చాలా డెవలప్ అయిందని మోడీ దీనిపై దృష్టి సారించారా అని విమర్శల వర్షం కురిపించారు. ఇలాంటి భజనలు ఎందుకండీ అని ప్రశ్నించారు.
ఇక నుంచి దావోస్ వంటి వాటికి వంటవాళ్లు
ఇక నుంచి దావోస్ వంటి వాటికి చంద్రబాబు, లోకేష్ వెళ్లవలసిన అవసరం లేదని, 'చంద్రజ్యోతి' ప్రకారం ఏపీ నుంచి బాగా వంట వచ్చిన నలుగురైదుగురిని అలాంటి చోట్లకు పంపిస్తే చాలునని ఎద్దేవా చేసారు. అప్పుడు వారు భోజనాలు చేసి వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. ఇక నుంచి ఆ పని చేద్దామన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ మీకే కాదని మాకూ ఉందని చెప్పారు.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications