అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో నో న్యూయర్.. వేడుకలు రద్దు, ప్రభుత్వం నిర్ణయం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకు అన్నిరకాల వేడుకలు రద్దు చేసింది. న్యూఇయర్ సందర్భంగా డిసెంబరు 31, జనవరి 1న వేడుకలు జరపొద్దని స్పష్టం చేసింది. ఆ రెండు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేస్తారు. రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచే వేళలను కూడా తగ్గించారు.

new year celebration canceled in andhra pradesh

డిసెంబర్ 31 అంటేనే మమూలు ఊపు ఉండదు. కొత్త ఏడాదికి ఘనంగా వెల్ కం చెప్పాల్సిందే. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కరోనా ఎఫెక్ట్ న్యూ ఇయర్‌పై కూడా పడింది. సెకండ్ వేవ్ వస్తోందని నిపుణులు చెబుతోన్న నేపథ్యంలో.. ఏపీ ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. దీంతో కుర్రకారు ఆశలకు గండికొట్టింది.

వైన్ షాపులు త్వరగానే మూసివేస్తారు. ఏపీలో మద్యం ధరలు కాస్త ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. దీనికితోడు సమయం కూడా రాత్రి పొద్దుపోయే వరకు కాకుండా.. త్వరగానే మూసివేస్తారు. డిసెంబర్ 31 నేపథ్యంలో లిక్కర్ షాపులను కూడా షెడ్యూల్ కన్నా ముందే మూసివేస్తారు.

English summary
new year celebrations canceled in andhra pradesh, state government take a decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X