ఏపీలో సెలవుల పొడగింపు లేదు, విద్యాశాఖ మంత్రి క్లారిటీ
సంక్రాంతి సెలవులు ముగుస్తున్నాయి. కరోనా కేసులు పెరగడంతో.. తెలంగాణలో స్కూళ్లు/ కాలేజీల సెలవులను పొడగించారు. ఏపీలో కూడా ఎక్స్ డెంట్ చేస్తారనే వార్తలు గుప్పున్నాయి. కానీ వాటిని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఖండించారు. పాఠశాలలకు సెలవులు పొడిగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. సంక్రాంతి సెలవుల పొడిగింపుపై విద్యాశాఖలో విస్తృత చర్చ జరిగిన సంగతి తెలిసిందే. స్కూళ్లకు సెలవుల పెంపుపై సోమవారం విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. పాఠశాలలకు సెలవులు పొడగించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.

13.87 పాజిటివ్ రేటు
రాష్ట్రంలో
కరోనా
పాజిటివ్
రేటు
ఇప్పటికే
13.87
శాతానికి
చేరడంతో
తల్లిదండ్రులు
ఆందోళన
చెందుతున్నారు.
విద్యార్థులకు
వ్యాక్సినేషన్
పూర్తికానందున
పాఠశాలలు
నడిపే
విషయంలో
విద్యాశాఖ
అధికారులు
తర్జన
భర్జన
పడుతున్నారు.
స్కూళ్లను
కొనసాగిస్తే
కరోనా
కేసులు
వెలుగు
చూస్తే
ఏం
చేయాలనే
అంశంపై
ప్రభుత్వానికి
స్పష్టత
లేదు.
రాష్ట్రంలో
కరోనా
వైరస్
వేగం
పెరిగింది.
కేసులు
భారీగా
వస్తున్నాయి.
రాష్ట్రంలో
కరోనా
కేసులు
పెరుగుతుండడంతో
యాక్టివ్
కేసులు
కూడా
రాకెట్
వేగంతో
దూసుకెళ్తున్నాయి.
స్కూళ్లు
తెరిస్తే
వైరస్
వ్యాప్తి
పెరిగే
ప్రమాదం
ఉందని
పలువురు
అభిప్రాయపడుతున్నారు.

సెలవుల పొడగింపు..?
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించినట్లు వెల్లడించింది. అధికారికంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ ప్రకటించారు కూడా.. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు ఇవాళ్టితో ముగియనున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించుకోవాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని.. విద్యాసంస్థలకు విద్యాశాఖ సూచించింది.

కేసుల టెన్షన్
కరోనా,
ఒమిక్రాన్
కేసులు
దడ
పుట్టిస్తున్నాయి.
ఇంతలో
సంక్రాంతి
సెలవులు
కలిసి
వచ్చాయి.
దానిని
తెలంగాణ
పొడగించగా..
ఏపీ
మాత్రం
అదేం
లేదంటోంది.
ఇప్పటికే
విద్యార్థులు
తరగతులను
నష్టపోతున్నారని
అభిప్రాయ
పడుతున్నారు.
ఆన్
లైన్
క్లాసుల
వల్ల
ఉపయోగం
లేదని
చాలా
మంది
పేరంట్స్
కూడా
అభిప్రాయపడుతున్నారు.
అందుకోసమే..
సెలవుల
పొడగించొద్దు
అని
ప్రభుత్వం
నిర్ణయం
తీసుకున్నట్టు
తెలుస్తోంది.
కడపటి
సమాచారం
అందేవరకు
మాత్రం
ఏపీలో
సెలవుల
పొడగింపు
అంశం
లేదు.