స్కూల్, కాలేజీకి 100 గజాల దూరంలో నో సిగరేట్.. గుట్కా, ఖైనీ, తంబాకు కూడా: ఏపీ ప్రభుత్వం

స్కూళ్లు, కాలేజీ పరిధిలో వైన్స్, గుట్కా అమ్మడం నిషేధం. వంద గజాల వరకు షాపులకు అనుమతి ఉండదు. గుట్కా, ఖైనీ, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులపై వంద గజాల దూరం వరకు అమ్మకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు ఉత్పత్తులను స్కూళ్లకు వంద గజాలు అంటే.. 300అడుగులు వరకు అమ్మకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. నిషేధిత పొగాకుకు సంబంధించిన ప్రాడక్టులు, సిగిరెట్లుపై ఖఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

పొగాకు నియంత్రణ

పొగాకు నియంత్రణ

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖతో విద్యాశాఖ సంప్రదింపులు జరిపింది. రెండు శాఖలతోపాటు పోలీసుశాఖతో సమన్వయం కావల్సి ఉంటుంది. పాఠశాల, ఉన్నత విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 2007-08లో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 21 ప్రభుత్వ శాఖలు పొగాకు నియంత్రణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం మాత్రం పటిష్టంగా వీటిని అమలు చెయ్యాలని భావిస్తోంది.

దూరం.. దూరం

దూరం.. దూరం

పిల్లలు, యూత్‌ పొగాకుకు దూరంగా ఉంచేందుకు నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విద్యాసంస్థల పరిధిలో ఈ నిబంధనలు అతిక్రమించి దుకాణాల్లో సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులు విక్రయించేవారికి రూ.20 నుంచి రూ.200 వరకు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ అధికారం ఇతర శాఖల అధికారులతోపాటు హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు కూడా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో అధికారులు ఎలా వ్యవహరించాలనే విషయంలో ప్రభుత్వం అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

కరోనా ఇంపాక్ట్..

కరోనా ఇంపాక్ట్..

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

ఫంగస్ బెడద

ఫంగస్ బెడద

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు.

డేంజర్ డెల్టా

డేంజర్ డెల్టా

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+