చంద్రబాబు కొత్త ఎత్తుగడ - ఎమ్మెల్సీ అభ్యర్ధి ఖరారు : "రెబల్స్" లక్ష్యంగా..!!

రెబల్ ఎమ్మెల్యేలకు ఫిక్స్ చేసేలా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని డిసైడ్ అయ్యారు. పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసారు. సంఖ్య పరంగా సాంకేతికంగా బలం ఉన్నా..వాస్తవంగా మద్దతు కనిపించటం లేదు. అధికార పార్టీని ఇరుకున పెట్టటం...రెబల్స్ లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసారు. ఒక సీటుకు పోటీ చేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో విప్ జారీ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యం రెబల్స్ గా కనిపిస్తోంది.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధ

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధ

అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ చంద్రబాబు కీలక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 23న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యపరంగా ఒక్కో అభ్యర్ధి గెలుపుకు 23 ఓట్లు అవసరం అవుతాయి. వైసీపీకి ఉన్న బలంలో ఏడుగురు అభ్యర్ధులను ఖరారు చేసింది. వారంతా నామినేషన్లు దాఖలు చేసారు. ఇదే సమయంలో చంద్రబాబు తమకు అసెంబ్లీలో ఉన్న సంఖ్య బలం సాంకేతికంగా 23 సీట్లు కావటంతో..ఎన్నికల్లో తమ అభ్యర్ధిని దింపాలని నిర్ణయించారు. ఇందుకోసం పంచుమర్తి అనురాధ పేరు దాదాపు ఖరారు చేసారు. వైసీపీ అభ్యర్ధుల విజయం ఏకగ్రీవమని భావిస్తున్న వేళ..చంద్రబాబు నిర్ణయంతో అనురాధ నామినేషన్ దాఖలు చేస్తే ఎన్నిక అవసరం అవుతుంది. అప్పుడు రెండు పార్టీలో రెబల్స్ కీలకం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఓట్లు గెలుపు ఓటమలు నిర్ణయంలో కీలకం కానున్నాయి.

విప్ జారీ..రెబల్స్ కు ఇరకాటం

విప్ జారీ..రెబల్స్ కు ఇరకాటం

టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ వైసీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు వారిని లక్ష్యంగా చేసుకొనేందుకు చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలనే ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. పార్టీ ఎన్నికల్లో విప్ జార చేయనుంది. దీని ద్వారా పార్టీ అభ్యర్ధికి ఈ నలుగురు కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో వైసీపీలోని కొందరు విభేదించిన ఎమ్మెల్యేల మద్దతు పైనా టీడీపీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. తొలి ప్రాధాన్యత ఓటుతో పాటుగా రెండో ప్రాధాన్యతను ఓటు ద్వారా తెలియచేసే అవకాశం సభ్యులకు ఉంటుంది. తొలి ప్రాధాన్యత లో మెజార్టీ చేరుకోకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. వైసీపీ నుంచి టీడీపీతో టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న వారిని అస్త్రంగా చంద్రబాబు ఈ ఎన్నికల్లో వైసీపీ పైన ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది.

చంద్రబాబు అసలు లక్ష్యం ఇదేనా

చంద్రబాబు అసలు లక్ష్యం ఇదేనా

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలనే నిర్ణయం వెనుక చంద్రబాబు అసలు లక్ష్యం స్పష్టం అవుతోంది. టీడీపీ నుంచి గెలిచి దూరమైన ఎమ్మెల్యేలను విప్ ద్వారా ఫిక్స్ చేయటంతో పాటుగా వైసీపీలో తమకు మద్దతుగా ఉన్న వారితో రెండో ప్రాధాన్యత ఓట్లు వేయించాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. విప్ ధిక్కరిస్తే వారి పైన చర్యలకు పార్టీ పట్టు బట్టే అవకాశం దక్కుతుంది. చర్యలు ఉన్నా లేకున్నా.. చర్చకు ఆస్కారం ఏర్పడుతుంది. అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీకి మద్దతుగా ఎవరైనా నిలిస్తే వారి పైన చర్యలు తీసుకోవాలంటే టీడీపీ రెబల్స్ పైన ముందుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా.. అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టాలనేది చంద్రబాబు వ్యూహంగా స్పష్టం అవుతోంది. నామినేషన్లకు ఈ నెల 13వ తేదీ వరకు సమయం ఉంది. దీంతో..ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగాలని చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయం కొత్త రాజకీయానికి కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+