అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపికి మ‌రో ఎమ్మెల్యే గుడ్ బై..క‌న్నీటి ప‌ర్యంతం : జ‌గ‌న్ తో భేటీ..!

|
Google Oneindia TeluguNews

టిడిపికి మ‌రో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుండి గెలిచిన మోదుగుల వేణు గోపాల రెడ్డి టిడిపిని వీడారు. ఆయ‌న జ‌గ‌న్ తో భేటీ అయి..అధికారికంగా వైసిపి లో చేర‌నున్నారు. అయితే, మోదుగుల కొంత కాలం గా వైసిపి లో చేరుతార‌నే స‌మాచారం ఉన్నా..ఇప్పుడు ఆయ‌న అధికారికంగా జ‌గ‌న్ ను క‌ల‌వ‌నున్నారు.

TDP Mla Modugula left party : He decided to join in YCP

కన్నీటి ప‌ర్యంత‌మైన మోదుగుల‌
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీని వీడారు. పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ పార్టీ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. టిడిపిలో తనకు జరిగిన అవమానాలను కార్యకర్తలతో చెప్పుకుని మోదుగుల కన్నింటి పర్యంతమయ్యారు. అంతే కాకుండా తనకు గౌరవం లేని చోట ఉండలేనని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఫోన్ చేస్తారేమోనని ఎదురుచూశానని, అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందే పార్టీ వీడుతున్నట్లు డివిజన్ అధ్యక్షులకు మోదుగుల తేల్చి చెప్పారు. చివరి సారిగా డివిజన్ పార్టీ అధ్యక్షులతో ఆయన గ్రూపు ఫోటోలు దిగారు. జ‌గ‌న్ తో స‌మావేశం త‌రువాత తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డి నుండి పోటీ చేసే విష‌యం పై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చారు.

ఎంపీగానే బ‌రిలో దిగుతారా..
2009 ఎన్నిక‌ల్లో న‌ర్స‌రావుపేట ఎంపీగా మోదుగుల వేణు గోపాల‌రెడ్డి టిడిపి నుండి గెలుపొందారు. 2014 ఎన్నిక‌ల్లో తిరిగి ఎంపీ సీటు కోరినా..ఆయ‌న‌కు గుంటూరు ప‌శ్చిమం కేటాయించారు. తొలి నుండి ఆయ‌న పార్టీలో అసంతృప్తితోనే ఉన్నా రు. త‌న‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌టం లేద‌ని ఆవేద‌న చెందారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎంపీ సీటు ఇవ్వాల‌ని పార్టీ అధినేత‌ను కోరారు. అయినా హామీ ల‌భించ‌లేదు. దీంతో..పార్టీని వీడాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్దుల ఎంపిక పై స‌మావేవం నిర్వ‌హించారు. ఆ స‌మావేశానికి మోదుగుల కు ఆహ్వా నం అంద‌లేదు. ఇక‌, పార్టీ వీడాల‌ని మోదుగుల నిర్ణ‌యించి జ‌గ‌న్ తో స‌మావేశం అవుతున్నారు. అందులో ఆయ‌న ఎంపీ గా గుంటూరు జిల్లా నుండి పోటీ చేయాల‌నే అంశం పై చ‌ర్చించ‌నున్నారు. ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలోని గుంటూరు, న‌ర్స‌రావు పేట లోక్‌స‌భ స్థానాల‌కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు ఉన్నారు. దీంతో, జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే ఆస‌క్తి నెల‌కొంది. అయితే, మోదుగుల స‌న్నిహితులు మాత్రం ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు లేదా న‌ర్స‌రావుపేట నుండే పోటీ చేస్తార‌ని చెబుతున్నారు.

English summary
TDP mla resigned party and decided to join in YCP. Guntur west MLa Modugula Venu Gopal Reddy met with party leadrs and announced his decision. He meeting with Jagan and fix his contesting seat in coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X