అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ లోని ఆ నియోజ‌క‌వ‌ర్గాలు : ఏపి నేత‌ల స‌మ‌ర్ధ‌త‌కు ప‌రీక్ష‌....!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana elections 2018 : తెలంగాణ లోని ఆ నియోజ‌క‌వ‌ర్గాలు ఏపి నేత‌ల స‌మ‌ర్ధ‌త‌కు ప‌రీక్ష‌....!

తెలంగాణ ఎన్నిక‌లు ఏపి మంత్రులు..అధికార పార్టీ సీనియ‌ర్ నేత‌ల స‌మ‌ర్ద‌త‌కు ప‌రీక్ష‌గా నిలుస్తున్నాయి. తెలంగాణ లో టిడిపి పోటీ చేస్తున్న స్థానాల్లో అక్క‌డి బాధ్య‌త‌ల‌ను ఏపి లో ఏరి కోరి 14 మంది నేత‌ల‌కు అప్ప‌గించారు. వారంతా ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ముఖ్యంగా కుక‌ట్ ప‌ల్లి, శేరి లింగంప‌ల్లి, రాజేంద్ర న‌గ‌ర్‌, ఉప్ప‌ల్‌, ఖ‌మ్మం వంటి నియోజ‌క‌వ‌ర్గాలు టిడిపికి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారాయి. కుక‌ట్‌ప‌ల్లిలో నంద‌మూరి కుటుంబం నుండి బ‌రిలో ఉండ‌టంతో.. అక్క‌డ గెలుపు..మెజార్టీ పార్టీ స‌వాల్ గా తీసుకుంది. దీంతో..అక్క‌డ ఏకంగా ఏపి మంత్రులే టిడిపి అభ్య‌ర్ధిగా మ‌ద్ద‌తుగా ప్ర‌చారంలోకి దిగారు. ఇప్పుడు అక్క‌డ ఫ‌లితాలు వీరి స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించ‌నున్నాయి.

తెలంగాణ లో ఎలాగైనా కెసిఆర్ ను ఓడించాల‌నే ల‌క్ష్యంతో కాంగ్రెస్ తో జ‌త క‌ట్టిన టిడిపి..తాము పోటి చేస్తున్న స్థానాల్లో గెలుపును స‌వాల్ గా తీసుకుంటున్నాయి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో అక్క‌డి పార్టీ అభ్య‌ర్ధి గెలుపు బాధ్య‌త‌ల‌ను సీమాంధ్ర ప్రాంత నేత‌ల‌కు అప్ప‌గించింది టిడిపి అధి నాయ‌క‌త్వం. ప్ర‌ధానంగా కుక‌ట్ ప‌ల్లి లో ఇప్ప‌టికే బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ లు త‌మ ఇంటి ఆడ‌ప‌డుచు గెలుపు కోసం ప్ర‌చారానిని ముహూర్తం సైతం ఖ‌రారు చేసుకున్నారు. ఇక‌, కుక‌ట్ ప‌ల్లి నంద‌మూరి అభిమానుల‌తో పాటుగా ప‌రిటాల ర‌వి అభిమానులు సైతం భారీగానే ఉన్నారు. దీంతో..అక్క‌డ మంత్రి ప‌రిటాల సునీత ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. అదే విధంగా..టిడిపి కి అండ‌గా నిలిచే ఓ ప్ర‌ధాన సామాజిక వ‌ర్గానికి చెందిన ఓటర్లు సైతం కుక‌ట్ ప‌ల్లి తో పాటుగా శేరి లింగంప‌ల్లిలోనూ ఉన్నారు.

Telangana election become test for Ap ministers and Tdp leaders..

వారిని ఆకట్టుకొ నే విధంగా..అదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఏప మంత్రులు..నేత‌ల‌కు అక్క‌డ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. సెటిలర్లు ఎక్కు వ‌గా ఉన్న ప్రాంతాల్లో రాహుల్ గాంధీతో పాటుగా చంద్ర‌బాబు సైతం రోడ్ షో లో పాల్గొన‌నున్నారు. దీని ద్వారా కూట‌మి నుండి బ‌రిలో ఉన్న అభ్య‌ర్ధుల కు సానుకూల‌త పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అందులో భాగంగా.. ఏపికి ప్ర‌త్యేక హోదా పై సోనియా ఇచ్చిన హామీ సైతం ఎన్నికల్లో సెటిల‌ర్ల పై ప్ర‌భావం చూపుంతుంద‌ని భావిస్తున్నారు.

ఇక‌, ఖ‌మ్మంకు సంబంధించి టిడిపి ముఖ్య నేత నామా నాగేశ్వ‌ర‌రావు పోటీలో ఉన్నారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఇప్ప‌టికే పార్టీలోని సీనియ‌ర్లు ఖ‌మ్మంలో మ‌కాం వేసారు. అక్క‌డి సామాజిక వ‌ర్గాల వారీగా ఓట‌ర్ల‌ను ఆకట్టుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక‌, రాజేంద్ర న‌గ‌ర్ లో గుంటూరు జిల్లాకు చెందిన టిడిపి నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

బిసి వ‌ర్గానికి చెందిన నేత‌లు అక్క‌డ ఇప్ప‌టికే అక్క‌డి పార్టీ కేడ‌ర్ ను.. ఓట‌ర్ల‌ను స‌మ‌న్వ‌య ప‌రిచే బ బాధ్య‌త‌లు మొద‌లు పెట్టారు. స‌త్తుప‌ల్లి, అశ్వారావు పేట లోనూ ఇదే ర‌క‌మైన వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. ఇక‌, ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో హోరా హోరీ పోరు ఉండ‌టంతో...నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు చూస్తున్న టిడిపి సీనియ‌ర్ల‌కు.. ముఖ్యంగా ఏపి మంత్రులకు ఇది ప‌రీక్ష‌గా మారింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ సామాజిక వ‌ర్గాల వారీగా ఓట‌ర్ల‌ను ఆకట్టుకొనేందుకు అప్ప‌ట్లో ఏపి మంత్రులు త‌మ వంతు పాత్ర పోషించారు. కానీ, ఫ‌లితాలు అంచ‌నా ల‌ను తారు మారు చేసాయి.

ఇక‌, ఇప్పుడు త్వ‌ర‌లో ఏపి ఎన్నిక‌లు సైతం స‌మీపిస్తుండ‌టంతో..ఇప్పుడు తెలంగాణ‌లో ని సెటిల‌ర్లు ను ప్ర‌భావితం ఏ స్థాయిలో చేయ‌గ‌ల‌ర‌నే అంశం ఆధారంగా భ‌విష్య‌త్ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల పై ఒ అంచనా ఏర్ప‌డే అవకాశం ఉంది. నేత‌ల స‌మ‌న్వ‌యానికి...ప్ర‌చారం ప‌రిశీల‌న‌కు..పార్టీ ప‌రంగా సూచ‌న‌లు..స‌ల‌హాలు అందించ టానికి వీలులుగా సీనియ‌ర్ నేత‌ల‌తో క‌మిటీ ఏర్పాటు చేసారు. దీంతో..తెలంగాణ ఎన్నిక‌లు ఏపి నేత‌ల స‌మ‌ర్ధ‌త‌ను ఏ విధంగా నిరూపించుకుంటారో చూడాలి.

English summary
Telangana elections now test for AP tdp leaders. Many tdp senior leaders and AP Ministers in campaign in favour of tdp candiates. Its time for leaders capacity testing time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X