వైఎస్ఆర్ జర్నలిస్టు బీమా ఏడాది పొడగింపు, రూ.42.63 లక్షలు మంజూరు, 21 వేల మందికి ప్రయోజనం
సమాచార సేకరణలో నిత్యం తలమునకలయ్యే జర్నలిస్టుల బీమాను మరో ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడగించింది. 2020-21 ఏడాదికి కూడా బీమా వర్తింపజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది బీమా పేరును వైఎస్ఆర్ జర్నలిస్ట్ బీమాగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. సమగ్ర బీమా పథకాన్ని.. వైఎస్ఆర్ జర్నలిస్టు బీమాగా పేరు మార్చారు.
మరో ఏడాది బీమా పథకం పొడగించడంతో నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.42.63 లక్షల అదనంగా నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీంతో రాష్ట్రంలో అన్నీ మీడియాల్లో పనిచేసే 21 వేల మంది వర్కింగ్ జర్నలిస్టులకు ప్రయోజనం కలుగుతోంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాకు చెందిన జర్నలిస్టులు ఉన్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తు సదరు జర్నలిస్టు చనిపోతే రూ.10 లక్షల బీమాను కుటుంబసభ్యులకు అందజేస్తారు.

జర్నలిస్టు బీమాను ఏడాది పొడగించడంపై జర్నలిస్టు సంఘాలు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరో ఏడాది పొడగించడాన్ని స్వాగతించారు. దీంతో తమ మిత్రులకు ప్రయోజనం కలుగుతోందన చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని వివరించారు.












Click it and Unblock the Notifications