అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీసం మెలేసాడు : వైసిపి లో చేరిన పోలీసు మాధ‌వ్ : సీటు ఖాయ‌మేనా..!

|
Google Oneindia TeluguNews

అనంత‌పురం జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించిన పోలీసు అధికారి గోరంట్ల మాధ‌వ్ వైసిపి లో చేరారు. ఎంపి జెసి దివాక‌ర్ రెడ్డిక వ్య‌తిరేకంగా మీసం మెలేసీ..హెచ్చ‌రించిన గోరంట్ల మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. పోలీ సు అధికారిగా సిబ్బంది పై ఎంపి జేసి చేసిన వ్యాఖ్య‌ల పై ఆయ‌న తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఊహించిన విధంగానే వైసిపి లో చేరారు.

ఉద్యోగానికి రాజీనామా.. వైసిపి లో చేరిక‌

ఉద్యోగానికి రాజీనామా.. వైసిపి లో చేరిక‌

అనంతపురానికి చెందిన పోలీసు అధికారి గోరంట్ల మాధ‌వ్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపి లో చేరారు. ఇటీవ‌లే ఆయ‌న త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించారు. ఎంపి జేసి పై మీసం మెలేసిన మాధవ్ అప్ప‌టి నుండి సంచ‌ల‌నం గా మారారు. ఆయ‌న‌ను ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలోకి రావాల‌ని వైసిపి నేత‌లు కోరారు.

 సిఐ ఉద్యోగానికి రాజీనామా

సిఐ ఉద్యోగానికి రాజీనామా

సిఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన త‌రువాత ఆయ‌న పార్టీ ఎంపి మిధున్ రెడ్డితో ప‌లుమార్లు స‌మావేశ‌మ‌య్యారు. చివ‌ర‌కు ఈ రోజు జ‌గ‌న్ స‌మక్షంలో వైసిపి కండువా క‌ప్పుకున్నారు. పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిం ది మొదలు ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. ఆ కమిట్‌మెంట్, నిజాయితీలే ఆయనకు ప్రజల్లో ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి.

పోటీకి సీటు ద‌క్కేనా..!

పోటీకి సీటు ద‌క్కేనా..!

ఉద్యోగాన్ని వ‌దిలి వైసిపి లో చేరిన మాధ‌వ్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ద‌క్కుతుందా లేదా అనే చ‌ర్చ మొద‌లైంది. రాజ కీయంగా మంచి భ‌విష్య‌త్ క‌ల్పిస్తామ‌నే పార్టీ నేత‌ల హామీ మేర‌కు ఆయ‌న వైసిపిలో చేరిన‌ట్లు చెబుతున్నారు. సొంత జిల్లా అయిన అనంత‌పురం నుండి ఆయ‌న‌కు సీటు కేటాయించాల‌ని జిల్లా నేత‌లు కోరుతున్నారు. అయితే, ఇప్ప‌టికే అనంత లో ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌న్వ‌క‌ర్త‌లు ఉన్నారు. ఎవ‌రిని మార్చే ప‌రిస్థితి లేదు. ఇక‌, హిందూపూర్‌, క‌దిరి వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో..మాధ‌వ్ విష‌యంలో జ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుం టార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది. అయితే మాధ‌వ్ మాత్రం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌కు ఆక‌ర్శితులై పార్టీలో చేరిన‌ట్లు ప్ర‌క‌టించారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని, పార్టీ బ‌లోపేతానికి త‌న వంతు కృషి చేస్తాన‌ని పేర్కొన్నారు.

English summary
Anantapur Ex Police Inspector joined in YCP in presence of YS Jagan. As police officer he differed with sitting M.P J.C Diwakar reddy comments against police deptmt. Then, He resigned to job and now join in ycp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X