తెలుగు తమ్ముళ్ల బాహా బాహీ.. గాల్లోకెగిరిన కుర్చీలు
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. నేతల మధ్య నివురు కప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. కళ్యాణదుర్గంలో జరిగిన పార్టీ సమావేశం రసాభాసగా మారింది. మండల కమిటీ ఎంపికలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు వర్గాలు బాహాబాహీకి దిగాయి.
ఉమా మహేశ్వర నాయుడు వర్గీయులపై ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గీయులు దాడికి దిగడంతోపాటు సమావేశానికి వచ్చిన నాయకుల ముందే కుర్చీలు విరగ్గొట్టారు. ఇరువర్గాలవారు కుర్చీలతో ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. నేతలు పలువురు సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ వారిముందే బాహాబాహీకి దిగారు.

కల్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టికెట్ కోసం ఈ ఇద్దరునేతలతోపాటు రామ్మోహన్ కూడా ఆశిస్తుండటంతో ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి హనుమంతరాయచౌదరి భంగపడ్డారు. అధిష్టానం నాయుడికి టికెట్ ఇవ్వడంతోనే విభేదాలు బయటపడ్డాయి. ఆ ఎన్నికల్లో తాము ఓటమిపాలవడానికి ఉన్నం కూడా ప్రధాన కారణమనేది ఉమా వర్గీయుల వాదన.
Chair Flung! A clash erupted between two factions of #TDP during a constituency review meeting in #Anantapur. #AndhraPradesh pic.twitter.com/MrSbkrzIG5
— Ashish (@KP_Aashish) November 9, 2022
సమావేశం జరుగుతున్న ప్రతిసారీ ఇరువర్గాలవారు బాహాబాహీకి దిగడం సర్వసాధారణమైపోయింది. అధిష్టానం జోక్యం చేసుకొని రానున్న ఎన్నికల్లో టికెట్ ఎవరికో ముందుగానే ప్రకటించాలని ఇక్కడి పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. దీనివల్ల అసమ్మతి నేతలను ఎదుర్కోవడానికి వీలవుతుందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications