వరుసగా మూడో రోజు... ఏపీలో కొత్తగా 10వేల పైచిలుకు కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,080 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,17,040కి చేరింది. కరోనాతో మరో 97 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1939కి చేరింది. ఇందులో గుంటూరులో 14,అనంతపురంలో 11,కర్నూలులో 11,పశ్చిమ గోదావరిలో 10,చిత్తూరులో 8,నెల్లూరులో 8,ప్రకాశంలో 7,శ్రీకాకుళంలో 7,తూర్పు గోదావరిలో 6,విశాఖపట్నం,విజయగనరంలో ఐదుగురు చొప్పున,కృష్ణాలో నలుగురు,కడపలో ఇద్దరు మృతి చెందారు.

గడిచిన 24 గంటల్లో మొత్తం 62,123 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 24,24,486 కరోనా టెస్టులు చేశారు. ఇక గడిచిన 24గంటల్లో మరో 9151 మంది కరోనా పేషెంట్లు కోలుకుని శుక్రవారం(అగస్టు 7) డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 1,29,615మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,486 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

10,080 new coronavirus cases were reported on Saturday,in Andhra Pradesh.More 97 corona patients were dead in the state from last 24 hours,Total number reached 2,17,040.

Recommended Video

    Consuming Hand Sanitisers : శానిటైజర్ లు ఇలా కూడా వాడేస్తున్నారు ! || Oneindia Telugu

    ఇటీవలి కాలంలో ఏపీలో 10వేల కరోనా పాజిటివ్ కేసులు తరుచూగా నమోదవుతున్నాయి. వరుసగా గత మూడు రోజుల నుంచి 10వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అయితే టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే తూర్పు గోదావరిలో అత్యధికంగా ఇప్పటివరకూ 30,160 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో 26,032 కేసులతో కర్నూలు,23,249 కేసులతో అనంతపురం,20,837 కేసులతో గుంటూరు ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+