చీమలు కుట్టి పసికందు మృతి, ప్రేమ పేరుతో నగలతో ఉడాయించిన టెక్కీ

విజయవాడ: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోజుల పసికందు చనిపోయాడు. నాలుగు రోజుల క్రితం జన్మించిన శిశువును అనారోగ్యం కారణంగా వెంటిలెటర్ పైన ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో శిశువు సోమవారం మృతి చెందాడు. సెలైన్ సీసాను నిర్లక్ష్యంగా పెట్టడంతో అధి శిశువి మీద పడి మృతి చెందిందని కొందరు చెబుతున్నారు. చీమలు కుట్టి పసికందు చనిపోయినట్లు మరికొందరు చెబుతున్నారు. ఈ ఘటన పైన తల్లిదండ్రులు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 10 day old baby dies after in Vijayawada Hospital

కలెక్టరేట్ వద్ద హోంగార్డు ఆత్మహత్యాయత్నం

ఆర్థిక సమస్యలు తాళలేక ఓ హోంగార్డు ఆంజనేయులు సోమవారం నాడు విషం తాగి మచిలీపట్నం కలెక్టరేట్ వద్దకు వచ్చాడు. అధికారులకు హోంగార్డు వినతిపత్రం ఇస్తూ వాంతులు చేసుకున్నాడు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించారు.

ఆంజనేయులు ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఆయన తండ్రి వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి ఇటీవలే మరణించాడు. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ చెల్లించమని వేధిస్తుండటంతో ఆంజనేయులు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తూ కుప్పకూలిపోయాడు. అప్పటికే అతడు పురుగుల మందు తాగాడని గుర్తించిన అదికారులు అతనిని ఆసుపత్రికి తరలించారు.

 10 day old baby dies after in Vijayawada Hospital

ప్రేమ పేరుతో టెక్కీ మోసం

ప్రేమ, పెళ్లి పేరుతో ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ మోసం చేశాడు. అతని పేరు శ్రవణ్ కుమార్. ప్రశాంతి అనే యువతిని పెళ్లి చేసుకున్న మూడు నెలలకే ఆమె నగలతో విదేశాలకు పరారయ్యాడు. అదనపు కట్నం కోసం తనను వేధఇంచడని ప్రశాంతి తెలంగాణలోని వరంగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆరు నెలలు కావొస్తుందని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. శ్రవణ్ కుమార్ ఆన్ లైన్లో పరిచయమైనట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+