బాలుడి హత్య: నిప్పంటించిందెవరు? ఉద్రిక్తత (పిక్చర్స్)
హైదరాబాద్: మెహిదీపట్నంలో ముస్తఫా అనే బాలుడికి నిప్పంటించి హత్య చేసిన విషయం తెలిసిందే. దీని పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ముస్తఫా మరణంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలటరీ గేటు ముందు గురువారం ఉదయం నుంచి క్షణక్షణం... ఉత్కంఠత నెలకొంది. జరిగిన సంఘటనపై ఓ వర్గం వారు చేరుకుంటుండటంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 100మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
రాపిడ్‌యాక్షన్‌ఫోర్స్, ప్రత్యేక పోలీసు బలగాలు పూర్తి బందోబస్తుతో మిలటరీ గేటు ముందు కనిపించడంతో ఆ ప్రాంతం యుద్ధ్ద వాతావరణాన్ని తలపించింది. ఈ సంఘటన నగర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాస్ తనదైన శైలిలో ఉదయం నుంచి సాయంత్రం బాలుడి అంత్యక్రియల వరకు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. రంగంలోకి శాంతి సంఘం సభ్యులను సైతం దింపారు.
ముస్తఫా ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గురువారం విచారణకు ఆదేశించారు. అలాగే ముస్త్ఫా కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ప్రభుత్వం తరఫున ముస్త్ఫా కుటుంబాన్ని పరామర్శించాల్సిందిగా ఎక్సైజుశాఖ మంత్రి టి పద్మారావు గౌడ్‌ను అదేశించారు. పద్మారావు గురువారం కుటుంబాన్ని పరామర్శించారు.

బాలుడి మృతి
గురువారం.. కాలిన సంఘటనలో మృతి చెందిన ముస్త్తఫా మృత దేహాన్ని సిద్దికీనగర్‌కు తరలిస్తున్నారన్న వార్తతో ఆర్మీ గేటు ముందు క్షణ క్షణం ఉత్కంఠ నెలకొంది.

బాలుడి మృతి
ఓ పక్క భారీ పోలీసు బందోబస్తు, మరోపక్క ఓ వర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున గుమిగూడుతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని పోలీసు అధికారులు ఆందోళనకు గురయ్యారు.

బాలుడి మృతి
మెహిదీపట్నం నుంచి మాసాబ్ ట్యాంక్ వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కనే మిలటరీ గేటు ఉండటంతో ఆందోళనకారులు వాహనాలపై, ప్రయాణీకులపై ఎలాంటి సంఘటనలకైనా పాల్పడితే పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తుందని, ముందు జాగ్రత్తగా అన్ని కోణాల్లో ఆలోచించి అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

బాలుడి మృతి
అయితే సిద్దికీనగర్ నుంచి సాయంత్రం ముస్తఫా అంతిమ యాత్ర వస్తుండటంతో ఓ వర్గం వారు ఆందోళన నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.

బాలుడి మృతి
అంతిమ యాత్ర వెంట ఉన్న నాంపల్లి శాసన సభ్యుడు జాఫర్ మేరాజ్‌హుస్సేన్ సమన్వయంతో వారందరినీ ముందుకు నడిపించారు.

బాలుడి మృతి
అంతిమ యాత్ర మిలటరీ గేటు దాటి ముందుకు రాగానే అంతిమ యాత్రలో పాల్గొన్న కొందరు ముస్తఫా మృతదేహం ఉన్న డీసీఎంను అక్కడ కొద్ది సేపు ఆపి ఆందోళన నిర్వహించేందుకు ప్రయత్నించారు.

బాలుడి మృతి
కానీ ఎమ్మెల్యే జాఫర్ మేరాజ్ హుస్సేన్ డీసీఎం డ్రైవర్ వైపున డీసీఎంపై నిలబడి ఎప్పటికప్పుడు డ్రైవర్‌ను అలర్ట్ చేస్తూ యాత్రను ముందుకు నడిపించారు.

బాలుడి మృతి
దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. శ్మశానవాటికకు వెళ్లేంత వరకు ఇలాంటి పరిస్థితి ఉండటంతో మేయర్ మాజీద్ హుస్సేన్ సైతం తన వంతు బాధ్యతను నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులకు సహకరించారు.

బాలుడి మృతి
ఓ వర్గం వారు మిలటరీ క్యాంపస్‌లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో దారికి అడ్డంగా ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు.

బాలుడి మృతి
క్యాంపస్‌లోకి గుర్తింపు కార్డు ఉన్నవారు, ముస్తఫాకు దగ్గరి బంధువులు తప్ప మరెవరూ లోపలికి ప్రవేశించరాదని పోలీసులు తేల్చి చెప్పారు.

బాలుడి మృతి
దీంతో కొంతమంది యువకులు రెచ్చిపోయి ఆందోళన సృష్టించేందుకు నల్ల జెండాలు చేత పట్టుకుని ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు.

బాలుడి మృతి
ఆర్మీ జవాన్లు చిత్ర హింసలకు గురిచేస్తున్నారని సిద్దికీనగర్ బస్తీ వాసులు కొందరు మీడియా ముందు వెల్లడించారు. లోపలికి వెళ్లాలన్నా, బయటికి రావాలన్నా పెద్ద సమస్యగా మారిందని వాపోయారు.

బాలుడి మృతి
మెహిదీపట్నంలో ముస్తఫా అనే బాలుడికి నిప్పంటించి హత్య చేసిన విషయం తెలిసిందే. దీని పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ముస్తఫా మరణంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బాలుడి మృతి
మిలటరీ గేటు ముందు గురువారం ఉదయం నుంచి క్షణక్షణం... ఉత్కంఠత నెలకొంది. జరిగిన సంఘటనపై ఓ వర్గం వారు చేరుకుంటుండటంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 100మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

బాలుడి మృతి
రాపిడ్‌యాక్షన్‌ఫోర్స్, ప్రత్యేక పోలీసు బలగాలు పూర్తి బందోబస్తుతో మిలటరీ గేటు ముందు కనిపించడంతో ఆ ప్రాంతం యుద్ధ్ద వాతావరణాన్ని తలపించింది.

బాలుడి మృతి
ఈ సంఘటన నగర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాస్ తనదైన శైలిలో ఉదయం నుంచి సాయంత్రం బాలుడి అంత్యక్రియల వరకు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. రంగంలోకి శాంతి సంఘం సభ్యులను సైతం దింపారు.

బాలుడి మృతి
కాగా, మిలిటరీ గ్యారిసన్‌లో సైన్యాధికారులు, జవాన్లు, సిద్ధిఖినగర్లో ుంటున్న వారి మధ్య పాతగొడవలు ఉన్నట్లు పోలీసులు కొంత సమాచారం సేకరించారు. ఈ కోణంలోను విచారిస్తున్నారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications