నీళ్ల కోసం వచ్చిన మైనర్ బాలికను... ఆ పాడు పాస్టర్ ఏం చేశాడంటే...
సభ్యసమాజం తలదించుకునేలా ఒ పాస్టర్ మైనర్‌బాలికపై అత్యాచారం చేసిన ఘటన రేణిగుంట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 55 సంవత్సరాల పాస్టర్ 11 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
రేణిగుంట: సభ్యసమాజం తలదించుకునేలా ఒ పాస్టర్ మైనర్‌బాలికపై అత్యాచారం చేసిన ఘటన రేణిగుంట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 55 సంవత్సరాల పాస్టర్ 11 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం తెలియగానే స్థానిక మహిళలు ఆ పాస్టర్ ను లాక్కొచ్చి.. గుంజకు కట్టేసి చితక్కొట్టారు. తరువాత పోలీసులకు అప్పగించారు. అతడు అఘాయిత్యానికి పాల్పడిన ఆ చిన్నారిని వైద్యపరీక్షలకు తరలించారు.

విషయం తెలుసుకున్న మీడియా మంగళవారం పద్మానగర్‌లోని స్థానిక మహిళలను వివరణ కోరగా.. పద్మానగర్ చర్చి సమీపంలో నివాసం ఉంటున్న ఒక బాలిక నీళ్లు పట్టుకోడానికి చర్చి వద్దకు రాగా పాస్టర్ సెల్వమణి ఆమెకు మాయమాటలు చెప్పి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు వారు వివరించారు.
తీవ్ర కడుపునెప్పితో కుంటుకుంటూ నడుస్తున్న ఆ బాలికను చూసిన స్థానికులు ఏం జరిగిందని ప్రశ్నించగా, సదరు బాలిక జరిగిన దారుణాన్ని బయటపెట్టింది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు ఆ పాస్టర్ పై దాడి చేశారు.












Click it and Unblock the Notifications