ఏపీలో కొత్తగా 1174 కరోనా కేసులు: పెరిగిన రికవరీ, కర్నూలులో అత్యల్ప కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మరోసారి, 1000కిపైగా కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 55,525 నమూనాలను పరీక్షించగా.. 1174 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది

ఏపీలో కొత్తగా 1174 కరోనా కేసులు, 9 మంది మృతి

ఏపీలో కొత్తగా 1174 కరోనా కేసులు, 9 మంది మృతి

తాజాగా నమోదైన 1174 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,37,353కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మృతి చెందారు.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురు మరణించగా, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,061కి పెరిగింది.

ఏపీలో 14,653 యాక్టివ్ కేసులు

ఏపీలో 14,653 యాక్టివ్ కేసులు


ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1309 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,08,639కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 14,653 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,74,13,209 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 208 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 05 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 18, చిత్తూరులో 159, తూర్పుగోదావరిలో 208, గుంటూరులో 131, కడపలో 69, కృష్ణాలో 140, కర్నూలులో 05, నెల్లూరులో 122, ప్రకాశంలో 161, శ్రీకాకుళంలో 16, విశాఖపట్నంలో 55, విజయనగరంలో 10, పశ్చిమగోదావరిలో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,89,005, చిత్తూరులో 2,41,855 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,660) కరోనా కేసులున్నాయి.

దేశంలోనూ పెరిగిన కరోనా కేసులు

దేశంలోనూ పెరిగిన కరోనా కేసులు

దేశంలోనూ కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, 35వేల ఎగువకు కొత్త కేసులు వెలుగుచూశాయి. అంతకముందు రోజుతో పోల్చితే తాజాగా 3.6 శాతం మేర పెరిగాయి. అయితే, కొత్త కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 14.48 లక్షల మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 35,662 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.34 కోట్లకు చేరింది. కరోనా బారిన పడి మరో 281 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మరణించిన సంఖ్య 4,44,529కు చేరింది. మరోవైపు, శుక్రవారం 33వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.26కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3.4 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.02 శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.65 శాతానికి చేరింది. కాగా కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో శుక్రవారం 23 వేలకుగా కరోనా కేసులు నమోదు కాగా, 131 మరణాలు సంభవించాయి. మరోవైపు, మహారాష్ట్రలో 3586 మంది కరోనా బారినపడ్డారు. కాగా, శుక్రవారం ఒక్కరోజే ప్రధాని నరేంద్ర మోడీని పుట్టిన రోజును పురస్కరించుకుని 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 79.42 కోట్లకు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+