ఏపీలో కొత్తగా మరో 12 కరోనా కేసులు, 161కి చేరిన బాధితుల సంఖ్య
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. గత 12 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 12 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కు చేరింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.
ఏపీలో కరోనా విలయం..
ఏపీలో కరోనా వైరస్ కలకలం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ కొన్ని జిల్లాలకే పరిమితమైన కేసుల ఉద్ధృతి ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాలకూ పాకింది. తాజాగా నిన్న రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకూ పరీక్షించిన శాంపిళ్లలో 12 కొత్త కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 161కు చేరింది.

టాప్ లో నెల్లూరు, ఆ తర్వాత కృష్ణా, గుంటూరు..
ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం చూస్తే నెల్లూరు జిల్లా నిన్నటి నుంచి టాప్ గా కొనసాగుతున్నట్లు అర్ధమవుతోంది. నిన్నటికే నెల్లూరులో 24 కేసులు నమోదు కాగా.. రాత్రికి రాత్రే మరో 8 కొత్త కేసులు వచ్చి చేరాయి. దీంతో ఒక్క నెల్లూరు జిల్లాలోనే 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లయింది. ఆ తర్వాతి స్ధానాల్లో కృష్ణా, గుంటూరు ఉన్నాయి. కృష్ణాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23గా నమోదు కాగా.. ఆ తర్వాత 20 కేసులతో గుంటూరు జిల్లా మూడో స్ధానంలో ఉంది.












Click it and Unblock the Notifications