ఏపీలో 1248 కొత్త కరోనా కేసులు: పెరిగిన రికవరీ, 13వేలకు యాక్టివ్ కేసులు, ప.గోలో అత్యధిక కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు మూడు రోజులుగా తగ్గినట్లే తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 1000పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 58,890 నమూనాలను పరీక్షించగా.. 1248 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1248 కరోనా కేసులు, 15 మంది మృతి

ఏపీలో కొత్తగా 1248 కరోనా కేసులు, 15 మంది మృతి


తాజాగా నమోదైన 1248 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,04,590కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 15 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,750 మృతి చెందారు.

ఏపీలో 13,677 యాక్టివ్ కేసులు

ఏపీలో 13,677 యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1715 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,77,163కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 13,677 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,61,98,824 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 198 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కడప జిల్లాలో 19 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 31, చిత్తూరులో 166, తూర్పుగోదావరిలో 66, గుంటూరులో 130, కడపలో 19, కృష్ణాలో 148, కర్నూలులో 25, నెల్లూరులో 120, ప్రకాశంలో 118, శ్రీకాకుళంలో 75, విశాఖపట్నంలో 67, విజయనగరంలో 45, పశ్చిమగోదావరిలో 238 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,84,250, చిత్తూరులో 2,36,563 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,175) కరోనా కేసులున్నాయి.

దేశ వ్యాప్తంగా కొత్త కరోనా కేసులివే

దేశ వ్యాప్తంగా కొత్త కరోనా కేసులివే

ఇది ఇలా ఉండగా దేశంలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో భారతదేశం 25,467 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య నిన్నటి 25,072 కంటే కొంచెం ఎక్కువ అయినప్పటికీ కరోనా క్షీణత దిశగా పయనిస్తూ ఉండటం ఒకింత ఊరట. నిన్న నమోదైన కేసులతో భారతదేశంలో మొత్తం కరోనా కేసులు 3.24 కోట్లకు పైగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 354 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం మరణాలు 4.35 లక్షలకు పైగా ఉన్నాయి. యాక్టివ్ కోవిడ్ కేసులు భారతదేశంలో 3,19,551 కి తగ్గాయి. 156 రోజుల్లో అతి తక్కువగా నమోదయ్యాయి .యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 1 శాతం కంటే తక్కువ నమోదు కావడం విశేషం . గత 24 గంటల్లో 39,486 మంది కరోనా రోగులు మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.17 కోట్లకు పైగా కోలుకున్నారు. రికవరీ రేటు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇది ప్రస్తుతం 97.68 శాతంగా ఉంది. గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+