ఏపీలో కొత్తగా 147 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్నంటే..?, యాక్టివ్ కేసుల్లో పెరుగుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 22,604 నమూనాలను పరీక్షించగా.. 147 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,92,008కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

ఏపీలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో కరోనా బారినపడి కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7185 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 103 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,83,380కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1443 యాక్టివ్ కేసులున్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు..

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు..

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,45,57,366 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 9, చిత్తూరులో 35, తూర్పుగోదావరిలో 31, గుంటూరులో 21, కడపలో 9, కృష్ణాలో 9, కర్నూలులో 4, నెల్లూరులో 9, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 7,

విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 1 కరోనా కేసులు నమోదయ్యాయి.

తిరుమల వేదపాఠశాలలో కరోనా కలకలం

తిరుమల వేదపాఠశాలలో కరోనా కలకలం

తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో టీటీడీ వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా.. 10 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ పది మందిలో ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులు ఉన్నారు. కరోనా సోకినవారిని మెరుగైన చికిత్స కోసం పద్మావతి కరోనా ఆస్పత్రికి తరలించారు. కాగా, మార్చి 10న ఈ వేదపాఠశాలలో 57 మందికి కరోనా సోకవడంతో వారందర్నీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. తాజాగా, మరో 10 మందికి కరోనా సోకడంతో మొత్తం బాధితుల సంఖ్య 67కి చేరింది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన సుమారు 420 మంది విద్యార్థులు ఈ వేదపాఠశాలలో వేద విద్యను నేర్చుకుంటున్నారు. కరోనా కలకలం సృష్టించడంతో పాఠశాల సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+