వీణా - వాణి ఆపరేషన్‌కు ఒప్పుకున్న లండన్ డాక్టర్లు, ఖర్చు 10 కోట్లు
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా- వాణి ఆపరేషన్‌కు లండన్ డాక్టర్లు ఒప్పుకున్నారు. ఇందుకు గాను రూ. 10 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. శుక్రవారం నాడు వీణా - వాణిల ఆపరేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను నీలోఫర్ ఆసుపత్రికి పంపిన లండన్ డాక్టర్లు ఆపరేషన్‌కు మొత్తం రూ. 10 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
దీంతో పాటు ఆపరేషన్‌కు 10 నెలల సమయం పడుతుందని అంతవరకు తమ పర్యవేక్షణలోనే చిన్నారులు ఉంటారని చెప్పారు. వీణా - వాణిల రిపోర్టులను పరిశీలించిన తర్వాత వారిద్దరని వేరు చేయడం సాధ్యంమని తేలడంతో ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు ఆమోదం తెలిపారు.

లండన్ డాక్టర్ల లేఖ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత వీణా - వాణిలతో పాటు తల్లిదండ్రులను కూడా లండన్‌కు పంపి, శస్త్ర చికిత్సను నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications