విజయవాడ, విశాఖతో పాటు ఆ నగరాల్లో.. లక్షన్నర ఉద్యోగాల జాతర!
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అమెజాన్ శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగల సీజన్ ను ఉద్దేశించి దేశవ్యాప్తంగా లక్షన్నర మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవడానికి అమెజాన్ డ్రైవ్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాలలో కూడా నియామకాలు చేపట్టింది.
నియామకాల డ్రైవ్ కొనసాగిస్తున్న అమెజాన్
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలు మాత్రమే కాకుండా, గుంటూరు, రాజమండ్రి, వరంగల్ వంటి చిన్న నగరాలలో కూడా ఈ కామర్స్ దిగ్గజం ఉద్యోగులను నియమించుకోవడానికి డ్రైవ్ కొనసాగిస్తోంది. మొత్తం దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా నగరాలలో కొనసాగిస్తున్న నియామకాల డ్రైవ్ ద్వారా ఈ పండుగ సీజన్లో ప్రజల నుండి పెరిగే ఆర్డర్లను సకాలంలో డెలివరీ చేయాలని నిర్ణయించింది.

గతంతో పోలిస్తే ఎక్కువ ఉద్యోగాలు
పండుగ సమయంలో అవసరమయ్యే అదనపు మానవ వనరుల అవసరం నేపథ్యంలో amazon ప్రతి సంవత్సరం సీజనల్ నియామకాలను చేపడుతోంది. ఈసారి గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలను కల్పించి ఎక్కువమంది యువతకు ఉపాధి కల్పించనుంది. amazon ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ హబ్ లు, డెలివరీ స్టేషన్లలో ఈ నియామకాలలో అవకాశం కల్పించనున్నారు.
అమెజాన్ లో జాబ్ వస్తే జీతంతో పాటు ఈ వసతులు
దేశవ్యాప్తంగా నాలుగు వందల చోట్ల ఈ నియామకాలు చేపట్టడంతో చాలామందికి తాము నివసించే దగ్గరలోనే పని అవకాశం కూడా కల్పించబడుతుంది. ఈ అమెజాన్ సీజనల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకి వేతనంతో పాటు ఇతర సౌకర్యాలను కూడా కల్పించి వారికి సైతం సామాజిక భద్రతను కల్పిస్తుంది. పనిచేసే చోట పరిశుభ్రమైన తాగునీరు తో పాటు అన్ని మౌలిక వసతులను కల్పిస్తుంది .
అమెజాన్ లో జాబ్ వస్తే ఆర్ధిక భరోసా, సామాజిక భద్రత
వారానికి రెండు వీక్లీ ఆఫ్ లు, వార్షిక సెలవులు, అనారోగ్యంగా ఉంటే సెలవులు లభిస్తాయి. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ, ఈ ఎస్ ఐ సి, భీమా కవరేజ్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కూడా ఉంటాయి. మరెందుకు ఆలస్యం ఈ పండుగ సీజన్లో అమెజాన్లో ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకొని ఆర్థిక భరోసాని పొందండి.












Click it and Unblock the Notifications