సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య 18 ప్రత్యేక రైళ్లు
దేశవ్యాప్తంగా రోజురోజుకు రైలు ప్రయాణికుల సంఖ్య ఎక్కువవుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో దీన్ని అధిగమించేందుకు భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న జోన్ల పరిధిలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. కొన్నిచోట్ల వీటి పరిమితి పూర్తయినప్పటికీ ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని వీటిని అధికారులు పొడిగించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య తిరుగుతున్న కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా అలాగే పొడిగించారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
ఆగస్టు 28 వరకు పొడిగించారు
08579 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు తిరిగే ఈ రైలును జులై 3 నుంచి ఆగస్ట్ 28 వరకు పొడిగించారు. వారానికి ఒకసారి తిరిగే ఈ రైలు మొత్తం తొమ్మిది ట్రిప్పులకు అందుబాటులో ఉండనుంది. ప్రతి బుధవారం సాయంత్రం 7.00 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఈ రైలుకు దువ్వాడ, దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

ఆగస్టు 29 వరకు పొడిగించారు
08580 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు తిరిగే ఈ రైలు జులై 4 నుంచి ఆగస్ట్ 29 వరకు పొడిగించారు. ఈ రైలు మొత్తం తొమ్మిది ట్రిప్పులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి గురువారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈరైలుకు మార్గమధ్యంలో నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. వీటిని తిప్పడంవల్ల ఈ రెండు నగరాల మధ్య రద్దీని అధిగమించవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications