ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, మరో 2 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ సడలించిన నాటి నుంచి మరిన్ని కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11,602 శాంపిల్స్‌ను పరీక్షించగా 135 మంది కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఇతర రాష్ట్రాలకు చెందినవారు 38, విదేశాల నుంచి వచ్చిన వారు 9 మంది కూడా కరోనా బారిన పడటంతో గత 24 గంటల్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 180గా నమోదైందని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5247 చేరింది.

180 new corona positive cases recorded in Andhra Pradesh and two more deaths

తాజాగా 65 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1641కు చేరింది. ఇప్పటి వరకు 2540 మందికి నెగిటివ్ అని తేలడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 800కుపైగా కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 500కు పైగా కేసులు ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మొత్తం 80 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కరోనాతో తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో మరొకరు మృతి చెందారు.
కాగా, రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కుమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 971 కాగా, 564 యాక్టివ్ కేసులున్నాయి. ఇక విదేశాల నుంచి వచ్చిన 197 మందికి వైరస్ సోకినట్లు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+