ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు, మరణాలు: 35వేలకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు భారీగా తగ్గుతోంది. తాజాగా 3వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 90,532 నమూనాలను పరీక్షించగా.. 2930 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 2930 కరోనా కేసులు, 36 మరణాలు
తాజాగా నమోదైన 2930 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,99,748కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 36 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు, అనంతపురం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 12,815 మృతి చెందారు. కాగా, శనివారం విశాఖపట్నం జిల్లాలో ఒక్క మరణం కూడా సంభవించలేదు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 35వేలకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 4,346 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 18,51,062కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 35,871 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,22,68,483 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 591 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 59 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 100, చిత్తూరులో 443, తూర్పుగోదావరిలో 591, గుంటూరులో 236, కడపలో 117, కృష్ణాలో 204, కర్నూలులో 119, నెల్లూరులో 185, ప్రకాశంలో 363, శ్రీకాకుళంలో 105, విశాఖపట్నంలో 70, విజయనగరంలో 59, పశ్చిమగోదావరిలో 338 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,64,988, చిత్తూరులో 2,21,492 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications