ఐక్య రాజ్య సమితి యూత్ అసెంబ్లీకి గుంటూరువాసి నిమ్మగడ్డ అఖిల్

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: ఐక్య రాజ్య సమితి యూత్ అసెంబ్లీ (యువ సమ్మేళనం)కి గుంటూరు జిల్లాకు చెందిన నిమ్మగడ్డ అఖిల్ ఎంపికయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు న్యూయార్క్‌లో యూత్ అసెంబ్లీ 2018 నిర్వహించనున్నారు.

దీనికి తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన అఖిల్ ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం అమెరికాలోని చార్లెట్‌లో ఉంటున్నారు. కంప్యూటర్ సైన్సులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు.

 2018 Winter Youth Assembly: Guntur youth for UN youth Assembly

అవినీతి, విద్య, నిరుద్యోగం, వాతావరణ సమస్యలు తదితర 17 అంశాలపై పదిహేనేళ్లుగా ఐక్య రాజ్య సమితి యువ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలు, నాయకత్వ ప్రతిభ ఆధారంగా యువతను ఎంపిక చేసి చర్చలకు ఆహ్వానిస్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guntur youth Nimmagadda Akhil selected for 2018 United Nations Organisation Youth Assembly.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి