అలర్ట్: ఏపీలో 24 ఎక్స్ ప్రెస్ రైళ్ల రద్దు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సూరారెడ్డిపాలెం, ఒంగోలు, విజయవాడ సెక్షన్లలో మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో 24 ఎక్స్ ప్రెస్ రైళ్లను అధికారులు రద్దుచేశారు. ఈ నెల 12,13,15,16,18,19 తేదీలలో తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. అలాగే ఈ నెల 13,14,15,17,18,20,21 తేదీలలో పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు కూడా రద్దు చేశారు.
తిరుపతి-బిలాస్‌పూర్ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 14,17 తేదీలలో రద్దు చేశారు. బిలాస్‌పూర్-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 12,16,19 తేదీల్లో రద్దు చేశారు. తిరుపతి-విశాఖ మధ్య నడుస్తున్న రైలును 17వ తేదీన, విశాఖ-తిరుపతి మధ్య నడుస్తున్న రైలును 18వ తేదీన రద్దుచేశారు.

అలాగే విశాఖ-చెన్నై మధ్య రాకపోకలు సాగిస్తున్న రైలును 18న, చెన్నై-విశాఖ మధ్య తిరుగుతున్న రైలును ఈనె 12, 19 తేదీల్లో రద్దుచేశారు.విశాఖ-తిరుపతి మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 18న, తిరుపతి-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 12,19 తేదీలలో రద్దు చేశారు.విశాఖ-మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 16,17 తేదీల్లో, మహబూబ్‌నగర్-విశాఖల మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 17,18 తేదీల్లో రద్దు చేశారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించడమే ధ్యేయంగా భారతీయ రైల్వే పనిచేస్తోందని అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా 60 మార్గాల్లో ఇవి సేవలందిస్తున్నాయి. కాకపోతే ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదు మినహా ప్రయాణికుల నుంచి మంచి ఆదరణను ఇవి దక్కించుకున్నాయి.












Click it and Unblock the Notifications