ఒక్కరోజులో 2 వేల మార్క్ దాటిన కరోనా కేసులు: ఏపీలో 2,432 పాజిటివ్, 44 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత 24 గంటల్లో 22 వేల పైచిలుకు శాంపిల్స్ సేకరించారు. అయితే 2 వేల 432 పాజిటివ కేసులు వచ్చాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 2412 మంది కాగా మిగతా 20 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు. దీంతో వైరస్ సోకిన మొత్తం సంఖ్య 35 వేల 451గా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల పైచిలుకు మందికి పరీక్షలు చేశారు. ఒక రోజులో 44 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 452కి చేరింది.

14 వేల 59 మంది వివిధ ఆస్పత్రుల్లో, 2 వేల 562 మంది కోవిడ్ సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది చొప్పున చనిపోయారు. కర్నూలులో 5, చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలో నలుగురు.. కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చనిపోయారు. నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు మరణించారు.

2432 coronavirus positive cases register in ap

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 468 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి. కర్నూలులో 403 రాగా.. చిత్తూరులో 257, తూర్పుగోదావరి జిల్లాలో 247 కేసులు వచ్చినట్టు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 100కి పైగా కరోనా పాజిటివ్ రాగా.. విజయనగరం జిల్లాలో మాత్రం కాస్త తక్కువగా వచ్చాయి. 49 కేసులు రావడం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే కరోనా వైరస్ కోసం పటిష్ట చర్యలు తీసుకున్న కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ కూడా విధిస్తోన్న పాజిటివ్ కేసులు మాత్రం తగ్గడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+