ఏపీ కరోనా అప్‌డేట్స్: 2 వేల కేసులు.. 44 మంది మృతి
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరస్ చల్లబడింది. ఏపీలో వైరస్‌కు చెక్ పెట్టడానికి జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో నిబంధనలు, ఆంక్షలను క్రమంగా ప్రభుత్వం తొలగిస్తోంది.
గత 24 గంటల్లో ఏపీలో 2 వేల 620 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ సోకిన 44 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58 వేల 140 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 12 వేల 363 మందికి చేరింది
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీసుకునే అవకాశం ఉంది. నామమాత్ర రుసుం రూ.250 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అందరికీ వ్యాక్సిన్ అందజేస్తే కరోనాను జయించడం తేలికే అవుతుంది.












Click it and Unblock the Notifications