ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 88కి చేరిన మరణాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 15,911 మంది నమూనాలు పరీక్షించగా 264 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది.
అయితే, తాజాగా నమోదైన 264 కేసుల్లో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందినవారివే 71 ఉండగా, రాష్ట్రంలో 193 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 6720 కేసులు నమోదయ్యాయి.

కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మృతి చెందినవారి సంఖ్య 88కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2851 చేరింది. ప్రస్తుతం వివిధ కరోనా ఆస్పత్రుల్లో 2341 మంది చికిత్స పొందుతున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
కాగా, దేశంలో ఇప్పటి వరకు 3,44,527 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,54,157 యాక్టివ్ కేసులున్నాయి. 1,80,469 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా 9925 మంది మరణించారు. మహారాష్ట్రలో లక్షకుపైగా కేసులు నమోదు కాగా, తమిళనాడు, ఢిల్లీలో 40వేల చొప్పున కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications