ఏపీలో కొత్తగా 2901 పాజిటివ్ కేసులు... మరో 19 మంది మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 2091 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,11,825కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6625కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం(అక్టోబర్ 25) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో 4352 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24గంటల్లో మొత్తం 75,757 శాంపిల్స్‌ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 76,96,653కు చేరింది.

2901 new coronavirus cases reported in andhra pradesh

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 464 కేసులతో తూర్పు గోదావరి, 411 కేసులతో కృష్ణా జిల్లా ఉన్నాయి. ఇప్పటివరకూ అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,08,601 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    Andhra Pradesh : 2997 New Covid 19 Cases Reported In AP | Oneindia Telugu

    ఇక తాజాగా నమోదైన మరణాల్లో... కడపలో నలుగురు,చిత్తూరులో ముగ్గురు,కృష్ణా జిల్లాలో ముగ్గురు,తూర్పు గోదావరిలో ఇద్దరు,ప్రకాశంలో ఇద్దరు,అనంతపురం,గుంటూరు,విశాఖపట్నం,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+