తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు: కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన మహిళకు పాజిటివ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 213కు చేరింది. ఈ వేరియంట్ వల్ల ఇప్పటిదాకా మరాణాలేవీ నమోదు కాకపోవడం ఊరట కలిగిస్తోంది. డిశ్చార్జ్‌లు కూడా ఆశించిన స్థాయిలో రికార్డవుతున్నాయి. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్రాలు ఆంక్షలను విధిస్తున్నాయి.

స్కూల్స్ మూసివేత దిశగా మహారాష్ట్ర..

స్కూల్స్ మూసివేత దిశగా మహారాష్ట్ర..


కర్ణాటక ప్రభుత్వం కొత్త సంవత్సరం వేడుకలను నిషేధించింది కూడా. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంక్షలను విధించడానికి సమాయాత్తమౌతోంది. పాఠశాలలను మూసివేసే దిశగా చర్యలను తీసుకుంటామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా ఏక్‌నాథ్ గైక్వాడ్ తెలిపార. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య 213కు చేరింది. 90 మంది దీని బారి నుంచి బయటపడ్డారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 213గా నమోదైంది.

ఢిల్లీ, మహారాష్ట్రల్లో అత్యధికం..

ఢిల్లీ, మహారాష్ట్రల్లో అత్యధికం..

దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రాలవారీగా వాటి సంఖ్యను వెల్లడించింది. ఇప్పటిదాకా 15 రాష్ట్రాల్లో ఈ వేరియంట్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధిక పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 57 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 17 మంది డిశ్చార్జ్ అయ్యారు. 54 పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. 28 మంది ఈ వేరియంట్ బారి నుంచి బయటపడ్డారు.

తెలంగాణలో 24

తెలంగాణలో 24

అత్యధిక పాజిటివ్ కేసులను నమోదు చేసిన రాష్ట్రాల జాబితాలో ఈ రెండు అగ్రస్థానంలో ఉన్నాయి. మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. 24 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఎవరూ డిశ్చార్జ్ కాలేదు. ఒమిక్రాన్ బాధితులందరూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నాలుగో స్థానంలో కర్ణాటక నిలిచింది. ఈ రాష్ట్రంలో 19 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్-18, కేరళ-15, గుజరాత్-14, జమ్మూ కాశ్మీర్-3, ఒడిశా-2, ఉత్తర ప్రదేశ్-2 కేసులు రికార్డయ్యాయి.

 కెన్యా నుంచి తిరుపతికి ట్రావెల్..

కెన్యా నుంచి తిరుపతికి ట్రావెల్..

చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లల్లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఆఫ్రికన్ కంట్రీ కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన ఓ విదేశీ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. 39 సంవత్సరాల ఆ మహిళ కెన్యా నుంచి విమానంలో చెన్నైకి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. ఈ నెల 12వ తేదీన ఆమెకు ఆర్టీపీసీఆర్ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది.

ఆరుమందికీ నెగెటివ్..

ఆరుమందికీ నెగెటివ్..

కేంద్ర ప్రభుత్వం గుర్తించిన రిస్క్ దేశాల్లో ఒకటైన కెన్యా నుంచి వచ్చినందున- ఆమె శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. కొద్దిసేపటి కిందటే- దీనికి సంబంధించిన రిపోర్టులు వచ్చాయి. ఆమెకు సోకింది కరనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌గా తేలింది. ఆరుమంది కుటుంబ సభ్యులకు వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. నెగెటివ్‌గా తేలినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు.

45 మంది విదేశీయుల రాక..

45 మంది విదేశీయుల రాక..

ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఆ విదేశీ మహిళ ఇన్‌స్టిట్యూషన్ క్వారంటైన్‌లో ఉన్నారని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. ఇప్పటిదాకా 45 మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారని, వారిలో తొమ్మిదిమందికి కరోనా వైరస్ సోకిందని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ నెగెటివ్ రిపోర్ట్ వచ్చాయని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్‌, కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దని అన్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటించాలని సూచించారు.

English summary
Second Omicron case detected in Andhra Pradesh. A 39-yr-old woman who came from Kenya travelled to Tirupati, tested positive for Covid on Dec 12. Her sample sent for genome sequencing declared Omicron positive today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X