cyclone michaung: తుఫాను ప్రభావంతో 305 రైళ్లు రద్దు, జాబితా ఇదే
హైదరాబాద్/అమరావతి: మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావంతో ముందు జాగ్రత్తగా
పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా 305 రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్ల రద్దు ఉంటుందని తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే తిరిగి పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు.
డసెంబర్ 4న 101 రైళ్లు, 5వ తేదీన 89 రైళ్లను, 6వ తేదీన 38 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వీటితో పాటు 11 రైళ్లను దారి మళ్లించినట్లు, మరో 11 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. మిచౌంగ్ లేదా మిగ్ జాం (Michaung) తుపాను నేపథ్యంలో జీఎం అరుణ్ కుమార్ రైల్ నిలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ తదితర ఆరు డివిజన్ల డీఆర్ఎంలతో దృశ్యమాధ్యమ సమీక్ష జరిపారు.

ట్రాక్, రైల్వే కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి సెక్షన్‌లోని రైల్వే ప్రభావితం చేసే ట్యాంక్‌ల స్థానాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్‌లపై మాన్‌సూన్ పెట్రోలింగ్ ఉండేలా చూడాలన్నారు. తుపాన్ ప్రభావిత రోడ్డు అండర్ బ్రిడ్జిల స్థానాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే మూసి వేయవచ్చని, నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు జీఎంకు వివరించారు. ఏమైనా పునరుద్ధరణ చర్యలు తక్కువ సమయంలో చేపట్టేందుకు ఇసుక సంచులు, బ్యాలస్ట్ నిల్వ చేసి ఉంచినట్లు అధికారులు తెలిపారు.
రద్దయిన రైళ్ల వివరాల జాబితా:
మద్రాస్ - ముంబై
తిరుపతి - మద్రాస్గూడూరు - రేణిగుంట
హౌరా - తిరుచినపల్
లినెల్లూరు - సుల్లూరుపేట
మధురై - ఢిల్
లీఎర్నాకులం - పాట్నా
విశాఖపట్టణం - తిరుపతి
సుల్లూరిపేట - నెల్లూరు
చెన్నై సెంట్రల్ - ముంబై
ఎల్.టి.టిచెన్నై సెంట్రల్ - బిట్రగుంట
చెన్నై సెంట్రల్ - తిరుపతి
తిరుచిరపల్లి - హౌరా
కోయంబత్తూర్ - బరౌని
గూడూరు - రేణిగుంట
తిరుపతి - పుల్లా
తిరుపతి - పూర్ణ,
తిరుపతి - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్
దారి మళ్లించిన రైళ్ల వివరాలు:
హౌరా - కన్యాకుమారి
ముంబై సీఎస్‌ఎంటీ - ఎంజీఆర్ చెన్నయ్ సెంట్రల్.












Click it and Unblock the Notifications