ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు: విజయనగరంలో అత్యల్పం, పశ్చిమగోదావరిలో అధికం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొద్ది రోజులుగా 500 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల సంఖ్య కూడా పదిలోపే ఉంటోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.

ఏపీలో కొత్తగా 316 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 316 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో 43,006 నమూనాలను పరీక్షించగా 316 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,72,288కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది. గత 24 గంటల్లో కరోనా చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు.

5వేలకు కరోనా యాక్టివ్ కేసులు

5వేలకు కరోనా యాక్టివ్ కేసులు

కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7038కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 595 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,56,729కి చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5626 యాక్టివ్ కేసులున్నాయి.

విజయనగరంలో అత్యల్పం.. గుంటూరులో అత్యధికం..

విజయనగరంలో అత్యల్పం.. గుంటూరులో అత్యధికం..

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,4,53,618 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 9, చిత్తూరులో 32, తూర్పుగోదావరిలో 35, గుంటూరులో 87, కడపలో 36, కృష్ణాలో 36, కర్నూలులో 4, నెల్లూరులో 25, ప్రకాశంలో 9, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 12, విజయనగరంలో 3, పశ్చిమగోదావరిలో 15 కేసులు నమోదయ్యాయి.

దేశంలో 4 లక్షల దిగువకు కరోనా కేసులు

దేశంలో 4 లక్షల దిగువకు కరోనా కేసులు

ఇక దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు96,80,594 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 91,44,375 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి 1,40,688 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,93,140 యాక్టివ్ కేసులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+