ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు... మరో ముగ్గురి మృతి...
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల ఉధృతి తగ్గినట్లే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,718కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7085కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3864 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (డిసెంబర్ 23) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
శరణ్య రవిచంద్రన్ హాట్ ఫోటో గ్యాలరీ..
తాజాగా మరో 499 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,68,769కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 57,716 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,14,15,246కు చేరింది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 84,చిత్తూరులో 64 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,23,396 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అతాజాగా నమోదైన మరణాల్లో... చిత్తూరు,కడప,కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
త్వరలోనే భారత్‌లో అత్యవసర వినియోగం కోసం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది.వ్యాక్సిన్ పంపిణీ కోసం అర్బన్ టాస్క్‌ఫోర్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ఛైర్మన్‌గా 9 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ టీమ్స్ కోసం సోమవారం(డిసెంబర్ 23) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందజేయడం, ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా టాస్క్‌ఫోర్స్‌లు పనిచేయనున్నాయి.