ఏపీలో కొత్తగా 385 కరోనా కేసులు: భారీగా పెరిగిన రికవరీ, 4వేలకు యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 400కు దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 39,848 నమూనాలను పరీక్షించగా.. 385 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 385 కరోనా కేసులు, నలుగురు మృతి

ఏపీలో కొత్తగా 385 కరోనా కేసులు, నలుగురు మృతి

కొత్తగా నమోదైన 385 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,66,450కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో చిత్తూరు, కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,373కి పెరిగింది.

ఏపీలో 4355కు తగ్గిన యాక్టివ్ కేసులు

ఏపీలో 4355కు తగ్గిన యాక్టివ్ కేసులు


ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 675 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,47,722కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 4,355 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,95,18,787 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 87 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 04, చిత్తూరులో 64, తూర్పుగోదావరిలో 87, గుంటూరులో 33, కడపలో 12, కృష్ణాలో 46, కర్నూలులో 06, నెల్లూరులో 34, ప్రకాశంలో 06, శ్రీకాకుళంలో 19, విశాఖపట్నంలో 27, విజయనగరంలో 07, పశ్చిమగోదావరిలో 40 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,93,836, చిత్తూరులో 2,46,935 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,967) కరోనా కేసులున్నాయి.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand
    దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

    దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

    దేశంలో కరోనావైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 11.35,142 నమూనాలను పరీక్షించగా.. 12,830 మందికి కరోనా సోకినట్లు తేలింది. శనివారం 446 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,58,186కి చేరింది. తాజాగా, 14,667 మంది కరోనాను జయించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.36 కోట్లకు చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. రికవరీ రేటు 98.20 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,59,272కి తగ్గింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. శనివారం 68,04,806 మందికి టీకా పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు కరోనా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 1.06 కోట్లు దాటింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+