విద్యుత్‌ షాక్‌తో కర్నూల్ జిల్లాలో నలుగురి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూల్:కర్నూల్ జిల్లాలో విద్యుత్‌షాక్‌తో నలుగురు మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంజామల మండలం మిక్కినేనిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు పొలానికి వెళ్తూ విద్యుధ్ఘాతానికి గురయ్యారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.అడవి పందులు పంటను ధ్వంసం చేయకుండా పొలం చుట్టూ ఏర్పాటు చేసిన కంచెకు విద్యుత్‌ సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

4 dies from electric shock At mikkineni palle on Kurnool

ఈ ప్రమాదంలో సుకూర్‌ బాషా, ఉప్పరి సుధాకర్‌, మద్దమ్మ, ప్రవల్లిక మృతిచెందగా.. మరో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కోవెలకుంట ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Four died with electricity shock in Kurnool district on Friday.This incident was happened in Mikkinenipally village.police registered case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి