వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పావులు కదుపుతున్నారు: 40మంది ఎమ్మెల్యేలతో నారా లోకేష్ భేటీ

తెలుగుదేశం పార్టీ యువనేత, మంత్రి నారా లోకేష్ గురువారం పార్టీకి చెందిన నలభై మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు సాధించే ఉద్దేశ్యంలో భాగంగా ఆయన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ యువనేత, మంత్రి నారా లోకేష్ గురువారం పార్టీకి చెందిన నలభై మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు సాధించే ఉద్దేశ్యంలో భాగంగా ఆయన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

లోకేష్ మంత్రి అయ్యాక తొలిసారి ఏకంగా నలభై మంది ఎమ్మెల్యేలతో భేటీ కావడం గమనార్హం. వారి నుంచి పలు సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల అభివృద్ధిపై వారితో చర్చిస్తున్నారు.

పని ప్రారంభించారు: జగన్ లోటస్‌పాండ్‌లో ప్రశాంత్ కిషోర్, మంతనాలుపని ప్రారంభించారు: జగన్ లోటస్‌పాండ్‌లో ప్రశాంత్ కిషోర్, మంతనాలు

మొత్తానికి టిడిపి నేతగా తనను తాను నిరూపించుకున్న లోకేష్.. ఇప్పుడు మంత్రి అయ్యాక ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించేందుకు పక్కాగా పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే లోకేష్‌ను భావి సీఎం అంటున్నారు.

నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో క్రమంగా ఎదిగిన విషయం తెలిసిందే. అయిదేళ్ల క్రితం జూ ఎన్టీఆర్, లోకేష్‌ల పేర్లు టిడిపి వారసుడిగా తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత జూనియర్ వర్గం సైలెంట్ అయింది. అనంతరం లోకేష్ పార్టీలో బాధ్యతలు చేపట్టారు.

కేబినెట్లోకి రాక..

కేబినెట్లోకి రాక..

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత కొంతకాలంగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఇటీవల జరిగిన విస్తరణలో ఆయనను కేబినెట్‌లోకి తీసుకున్నారు.

పట్టు కోసం..

పట్టు కోసం..

తొలుత పార్టీపై పట్టు సాధించే వరకు నారా లోకేష్‌ను ప్రభుత్వంలోకి తీసుకోలేదు. ఆయనకు పార్టీపై ఒకింత పట్టు వచ్చాక మంత్రిగా చేశారు. ఇప్పుడు నారా లోకేష్ పార్టీ, ప్రభుత్వాలపై పట్టు సాధించే క్రమంలో భాగంగా ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

భావి ముఖ్యమంత్రిగా..

భావి ముఖ్యమంత్రిగా..

ఇప్పటికే నారా లోకేష్‌లో టిడిపి నేతలు భావి ముఖ్యమంత్రిని చూస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని పలువురు నేతలు ఇప్పటికే చెప్పారు. 2019లో కాకపోయినా 2024 నాటికి లోకేష్ టిడిపి సీఎం అభ్యర్థి అని చాలామంది భావిస్తున్నారు.

ఎమ్మెల్యేలతో భేటీ

ఎమ్మెల్యేలతో భేటీ

చంద్రబాబు తర్వాత... టిడిపి నేతగా, మంత్రిగా... నారా లోకేష్ పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు సాధించుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆయన పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

English summary
Andhra Pradesh Minister Nara Lokesh on Thursday met 40 Telugudesam Party MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X